Tirumala | తిరుమల కాటేజ్‌లో.. నాగుపాము హల్చల్!

విధాత: తిరుమలలో ఐదు అడుగుల నాగుపాము హల్ చల్ చేసింది. తిరుమల కొండపై వీఐపీ ప్రాంతం పద్మావతి ఏరియాలో నాగుపాము బుసలు కొడుతూ కలకలం రేపింది. తిరుమల నారాయణ గిరి స్పెషల్ కాటేజ్‌లో రూమ్ 12 దగ్గర నాగు పాము భక్తులకు కనిపించింది. దీంతో భక్తులంతా ఆందోళనకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు.
టీటీడీ సిబ్బంది సమాచారంతో స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు అక్కడకు చేరుకున్నారు. అత్యంత చాకచక్యంగా 5.5 అడుగుల నాగుపామును బంధించారు. అనంతరం ఈ నాగుపామును పాపనాశనం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. నాగుపామును అక్కడి నుంచి తరలించడంతో స్థానికులు, భక్తులుఊపిరి పీల్చుకున్నారు.
తిరుమలలో నాగుపాము.. పట్టుకొని అడవిలో వదిలిన TTD ఉద్యోగి
తిరుమల నారాయణ గిరి స్పెషల్ కాటేజ్‌లో 5.5 అడుగుల నాగుపామును TTD ఉద్యోగి భాస్కర్ నాయుడు పట్టుకొని అడవిలో వదిలారు. విష సర్పాన్ని పట్టడానికి శ్రమించారు. అరగంట పాటు భక్తులు భయాందోళనకు గురయ్యారు. pic.twitter.com/PrnwFn6W4P
— ChotaNews App (@ChotaNewsApp) April 27, 2025