మరో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

విధాత: పోలీస్ శాఖలో మరో మహిళా కానిస్టేబుల్ బలవన్మరణం కలకలం రేపింది. వరంగల్ జిల్లా కాజీపేట దర్గా ప్రాంతంలో అర్చన అనే మహిళా కానిస్టేబుల్ చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 2022 లో వివాహం జరిగి కొద్దిరోజులకే విడాకులు అయినట్లు స్థానికులు చెబుతున్నారు. అప్పటినుంచి మానసికవేదనకు గురవుతూ జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. కానిస్టేబుల్ అర్చన కొద్దిరోజులుగా డ్యూటీకి సెలవు పెట్టి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది.
కాగా పెండ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్తాపంతో ఇటీవలే జనగామ జిల్లా కొడకండ్ల మండలం నీలిబండ తండాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ గుగులోతు లీల (26) సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. మహిళా కానిస్టేబుళ్ల వరుస ఆత్మహత్యలు పోలీసువర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది.