Lawyer Murder: హైదరాబాద్‌లో.. నడిరోడ్డుపై లాయర్ దారుణ హత్య
హైదరాబాద్‌లో పట్టపగలు నడిరోడ్డుపై లాయర్ దారుణ హత్య సంచలనం రేపింది. సంతోష్ నగర్ న్యూ మారుతి నగర్ కాలనీలో లాయర్ ఇజ్రాయిల్‌పై ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న దస్తగిరి కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలకు గురైన లాయర్ ఇజ్రాయిల్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Lawyer murdered :
హైదరాబాద్‌లో పట్టపగలు నడిరోడ్డుపై లాయర్ దారుణ హత్య సంచలనం రేపింది. సంతోష్ నగర్ న్యూ మారుతి నగర్ కాలనీలో లాయర్ ఇజ్రాయిల్‌పై ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న దస్తగిరి కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలకు గురైన లాయర్ ఇజ్రాయిల్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొద్ది రోజులుగా లాయర్ ఇజ్రాయిల్‌కు చెందిన ఇంట్లో దస్తగిరి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు.
ఇటీవల ఓ మహిళ నిందితుడు దస్తగిరి తనను వేధింపులకు గురి చేస్తున్నాడని లాయర్ ఇజ్రాయిల్‌ను ఆశ్రయించింది. మహిళ తరపున దస్తగిరిపై లాయర్ ఇజ్రాయిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై ఫిర్యాదు చేశాడన్న కోపంతో దస్తగిరి లాయర్ ఇజ్రాయిల్ పై పగ పెంచుకుని కత్తితో దాడి చేశాడు. కత్తి పోట్లతో లాయర్ ఇజ్రాయిల్ మరణించగా..ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నట్లుగా సమాచారం.