లోన్ యాప్స్ వేధింపులు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బలవన్మరణం!

విధాత: లోన్ యాప్స్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. కామారెడ్డి సదాశివనగర్ కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సందీప్ లోన్ యాప్ వేధింపులకు తాళలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్‌లో అప్పు తీసుకున్న సందీప్ ఆ మొత్తాన్ని స్టాక్ మార్కెట్ లో పెట్టి నష్టపోయాడు.
దీంతో తీసుకున్న రుణం తిరిగి చెల్లించకపోవడంతో యాప్ ఏజెంట్లు కామారెడ్డిలోని అతని ఇంటికెళ్లి అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో మనస్తాపం చెందిన సందీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. సందీప్‌కి 5 నెలల క్రితమే వివాహమైంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.