మావోయిస్టులు లొంగిపోవాలి: మల్లోజుల కీలక సందేశం

మావోయిస్టు అగ్రనేత మల్లోజులత వేణుగోపాల్ మరో వీడియోను విడుదల చేశారు. మావోయిస్టులు లొంగిపోవాలని కోరుతున్నాను అని వీడియోలో ఆయన వెల్లడించారు. పరిస్థితులు మారుతున్నాయి, దేశం కూడా మారబోతోందన్నారు. ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. హిడ్మాతో పాటు పలువురు మావోయిస్టుల ప్రాణాలు పోయాయి, మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించింది అని తెలిపారు.

  • By: Subbu |    news |    Published on : Nov 19, 2025 11:40 AM IST
మావోయిస్టులు లొంగిపోవాలి: మల్లోజుల కీలక సందేశం

విధాత: మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ మరో వీడియోను విడుదల చేశారు. మావోయిస్టులు లొంగిపోవాలని కోరుతున్నాను అని వీడియోలో ఆయన వెల్లడించారు. పరిస్థితులు మారుతున్నాయి, దేశం కూడా మారబోతోందన్నారు. ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. హిడ్మాతో పాటు పలువురు మావోయిస్టుల ప్రాణాలు పోయాయి, మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించింది అని తెలిపారు.

కాగా నిన్న ఏపీలోని మారేడుమిల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత మాడ్వీ హిడ్మా, అతని భార్య రాజేతో సహా ఆరుగురు హతమయ్యారు. తాజాగా మావోయిస్టు అగ్ర నేత దేవ్‌జీ అలియాస్(తిప్పరి తిరుపతి), ఆజాద్, జోగా రావు పోలీసుల కాల్పుల్లో మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.