Hari Hara Veera Mallu: పవన్ నోట.. హరిహర వీరమల్లు ‘మాట వినాలి’

విధాత: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న నూతన చిత్రం హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu). శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తుండగా మొదటి భాగాన్ని మార్చి28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రత్నం తనయుడు జ్యోతికృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు తీసుకోగా నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్‌లో ఉండడంతో మేకర్స్ నూతన సంవత్సరం, సంక్రాంతిని పురస్కరించుకుని ఈ మూవీ నుంచి ఓ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేస్తున్నట్లు అప్డేట్ ఇచ్చారు. అయితే ఈపాటను పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పాడడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. మాట వినాలి అంటూ సాగే ఈ పాటను 6.01.2025 సోమవారం ఉదయం 9.గంటల 6 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
అయితే తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో పవన్ లుక్ చూస్తే రుద్రవీణ చిత్రంలో నమ్మకు నమ్మకు ఈ రేయిని అనే పాటను గుర్తు చేసేలా ఉండడం విశేసం. ఇదిలాఉండగా గతంలో నాలుగైదు చిత్రాల్లో పాటలు పాడిన పవన్ మళ్లీ చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాలో పాట పాడుతుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.అయితే.. తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా పవన్ కల్యాణ్ వాయిస్‌తోనే పాట ఉండబోతున్నట్లు సమాచారం.