Medak | మే 24న.. గొర్రెల కాపరుల అవగాహన సదస్సును జయప్రదం చేయండి
Medak | విధాత, మెదక్ బ్యూరో: ఈ నెల 24న బుధవారం మధ్యాహ్నం 1:30గంటలకు మెదక్ పట్టణం లోని మాయాగార్డెన్స్ లో రెండో విడుత గొర్రెల పంపిణీ లబ్ధిదారులకు జిల్లా పశు సంవర్ధక శాఖ, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన సదస్సుకు స్థానిక mla పద్మదేవేందర్ రెడ్డి, నర్సాపూర్ mla ch మదన్ రెడ్డి లతో పాటు ముఖ్య అతిధిగా ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖా మాత్యులు తన్నీరు హరీష్ రావు హాజరవుతున్నారని ఉమ్మడి మెదక్ […]

Medak |
విధాత, మెదక్ బ్యూరో: ఈ నెల 24న బుధవారం మధ్యాహ్నం 1:30గంటలకు మెదక్ పట్టణం లోని మాయాగార్డెన్స్ లో రెండో విడుత గొర్రెల పంపిణీ లబ్ధిదారులకు జిల్లా పశు సంవర్ధక శాఖ, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన సదస్సుకు స్థానిక mla పద్మదేవేందర్ రెడ్డి, నర్సాపూర్ mla ch మదన్ రెడ్డి లతో పాటు ముఖ్య అతిధిగా ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖా మాత్యులు తన్నీరు హరీష్ రావు హాజరవుతున్నారని ఉమ్మడి మెదక్ జిల్లా గొర్రెల పెంపంకం దారుల సంఘం అధ్యక్షుడు పోచబోయిన శ్రీహరి యాదవ్ తెలిపారు.
జిల్లాలోని గ్రామాల ప్రాథమిక గొర్రెల పెంపకం దారుల సహకార సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులతో పాటు,లబ్ధిదారులు అందరూ విధిగా పాల్గొని విధి విధానాలు తెలుసుకొని, పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. లబ్ధిదారుల వాటా చెల్లింపులు, కొనుగోలు రవాణా తదితర అంశాలపట్ల పూర్తి అవగాహన, కోసం నిర్వహిస్తున్న ఈ సదస్సును విజయవంతం చేయాలన్నారు. మీడియా సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ మెదక్ జిల్లా అధ్యక్షులు గండి మల్లేష్ యాదవ్, పెద్దకురుమ మల్లేష్, కాకర్ల సత్యనారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.