Telangana: దివ్యాంగుడికి.. మంత్రి కోమటిరెడ్డి సాయం! నెట్టింట ర‌చ్చ‌

  • By: sr    news    Apr 11, 2025 10:30 AM IST
Telangana: దివ్యాంగుడికి.. మంత్రి కోమటిరెడ్డి సాయం! నెట్టింట ర‌చ్చ‌

విధాత: సహాయం కోసం తన వద్ధకు వచ్చే నిరుపేదలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన అనుచరుల మాట మేరకు లక్షల రూపాయల సహాయం చేస్తుండటం చూస్తుంటాం. ఉన్నత చదువుల కోసం విద్యార్ధులకు..ప్రమాదాల్లో గాయపడిన, చనిపోయిన పేదలకు సహాయం చేస్తుంటారు. ఈ దఫా తన పర్యటనలో కారు వ‌ద్ద‌కు వ‌చ్చిన దివ్యాంగుడిని చూసిన వెంకట్ రెడ్డి కారు ఆపి ఏం కావాలని అడిగాడు. సార్ నాకు మీరు ఒకప్పుడు కోనిచ్చిన బ్యాటరీ వెహికల్ బ్యాటరీ పాడైపోయిందని చెప్పాడు. బ్యాటరీకి ఎంతవుతుందని కోమటిరెడ్డి అడుగగా.. బ్యాటరీకి రూ.8వేలు కావాలని దివ్యాంగుడు చెప్పాడు. దీంతో మంత్రి వెంకట్ రెడ్డి తన జేబులో 10వేలు ఉన్నాయని.. అందులోంచి 8వేలు తీసి ఆ దివ్యాంగుడికి ఇచ్చాడు. వాటిని తీసుకుని బ్యాటరీ వేసుకుని ఆఫీస్ వద్ధ పీఏకు చూపించిపోవాలని.. తాగి తిని పైసల్ ఆగం చేయవద్దని కోమటిరెడ్డి అతనికి సూచించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

సాయంపై సోషల్ మీడియాలో విమర్శలు

దివ్యాంగుడికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన సహాయంపై విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో నిప్పుకోడి అనే ట్విటర్ ఖాతాలో చేసిన పోస్టుపై కోమటిరెడ్డి అభిమానులు మండిపడుతున్నారు. పైసలు ఎక్కువున్న బలుపు మామూలుగా లేదు అంటూ పోస్టులో వెంకట్ రెడ్డిని విమర్శించారు. దీనిపై కోమటిరెడ్డి అభిమానులు ప్రతిస్పందిస్తూ మంత్రి వెంకట్ రెడ్డి ఒకప్పుడు ఆ దివ్యాంగుడికి బ్యాటరీ వెహికల్ కొనిచ్చాడని.. ఇప్పుడు ఆ బండిలో బ్యాటరీ పాడైతే మళ్లీ డబ్బులు ఇచ్చి ఆ పెద్దోడిని ఆదుకున్నాడని గుర్తు చేశారు. అటువంటి గొప్ప మనిషిని పట్టుకొని డబ్బులు ఎక్కువైనాయ్ అని అంటావా? అని బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రతినిధి కొంతం దిలీప్ పై కోమటిరెడ్డి అభిమానులు ఫైర్ అయ్యారు.

డబ్బులు ఎక్కువై మీలాగా ఫామ్ హౌస్‌లు కట్టుకోలేదని..డబ్బులు ఎక్కువై రోజూ హీరోయిన్‌లతో పబ్‌లకు వెళ్లి డ్రగ్స్ తీసుకోవడం లేదని బీఆర్ఎస్ నాయకులపై విరుచుక పడ్డారు. తనకు ఉన్న డబ్బులతో ప్రతీక్ ఫౌండేషన్ పెట్టి నలుగురికి వెంకట్ రెడ్డి సహాయం చేస్తున్నాడన్నారు. నల్లగొండలో ఎవరినైనా అడుగాలని.. వెంకన్న అంటే కష్టాల్లో ఉన్నవాళ్లకు ఎప్పుడూ అండగా ఉంటాడన్నారు. మీ దొరలు వంద జన్మలు ఎత్తినా కోమటిరెడ్డి చేసినంత సహాయం చేయలేరని, దుబాయ్‌లో పడుకొని తమాషాలు చేస్తున్నావా? మిస్టర్ దిలీప్ అంటు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీవు చేసే నీచపు పనులు, ఫేక్ పేజీలతో ఫేక్ ప్రచారం దుబాయ్ నుండి చేస్తున్నావని అందరికీ తెలుసని..ఇలా ఏది పడితే అది రాస్తాం.. మంచితనాన్ని కూడా ఇలా తప్పుగా చూపిస్తాం అంటే..బట్టలు ఊడదీసి కొడతారని హెచ్చరించారు.