మీనాక్షి నటరాజన్‌తో.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ!

విధాత: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి బుధవారం గాంధీభవన్ లో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మీనాక్షి నటరాజన్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందన్నారు. నాతో పాటు పార్లమెంట్ లో ఎంపీ గా కలిసి పనిచేసిన వ్యక్తి అని..ఇంచార్జిగా వచ్చిన తరువాత మొదటి సారి కలిశానని తెలిపారు. జిల్లాల వారీగా ఇంచార్జిలు, పార్టీ నిర్మాణంపై చర్చ జరిగిందన్నారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు.
నన్ను కూడా యాక్టీవ్ రోల్ ప్లే చేయాలనీ కోరారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. మంత్రి పదవి విషయంలో జానారెడ్డిపై చేసిన విమర్శలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు. జానారెడ్డి అంటే నాకు గౌరవమని..మా పార్టీ సీనియర్ నేత అని పేర్కొన్నారు. కేబినెట్ విస్తరణకు సంబంధించి రంగారెడ్డి జిల్లా ప్రాతినిధ్యంపై జానారెడ్డి రాసిన లెటర్ పై నేను ఒక సభలో మాట్లాడింది నిజమేనన్నారు. మంత్రి పదవి పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయమని, నేను అందుబాటులో లేకనే సీఎల్పీ సమావేశానికి రాలేదని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.