nagarjuna akkineni: చంద్రబాబు ఇంటికి అక్కినేని నాగార్జున

nagarjuna akkineni:  చంద్రబాబు ఇంటికి అక్కినేని నాగార్జున

nagarjuna akkineni:: సినీ హీరో నాగార్జున .. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లారు. తన కుమారుడి వివాహానికి రావాలంటూ ఆహ్వానించారు. మంగళవారం నాగార్జున ఏపీలోని ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి చేరుకొని ఆయనతో కొద్ది సేపు భేటీ అయ్యారు. నాగార్జున గతంలో వైసీపీ ప్రభుత్వానికి బహిరంగంగా మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.

దీంతో టీడీపీ క్యాంప్ ఆయనను దూరం పెడుతూ వచ్చింది. మరోవైపు బీఆర్ఎస్ పెద్దలు, అప్పటి ప్రభుత్వంతో కూడా సఖ్యతో ఉంటూ వచ్చేవారు. ఇదిలా ఉండగా నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చేయడం అప్పట్లో పెను సంచలనంగా మారింది.

ఏపీలోని టీడీపీ ప్రభుత్వం.. తెలంగాణ లోని కాంగ్రెస్ ప్రభుత్వంతో నాగార్జున ఇబ్బంది పడ్డట్టుగా అనిపించింది. అయితే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును.. కొన్ని రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నాగార్జున కలవడం గమనార్హం.

త్వరలో నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ కూడా వివాహం జరగబోతున్నది. ఇప్పటికే ప్రముఖ బిజినెస్‌మెన్ జుల్ఫీ రవ్‌డ్జీ కుమార్తె జైనబ్‌తో గతేడాది నవంబర్ 26వ తేదీన అక్కినేని అఖిల్ నిశ్చితార్థం చేశారు.

ఇక, ఈ నెల 6వ తేదీన అక్కినేని అఖిల్ – జైనబ్‌ వివాహం నిర్వహించబోతున్నారు.. జైనబ్ హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి.. కొన్ని ఏళ్లుగా అఖిల్‌తో ప్రేమలో ఉన్నారు.