Nagarjuna Sagar Gates Opened | నాగార్జున సాగర్‌ 26గేట్ల నుంచి నీటి విడుదల

నాగార్జునసాగర్‌ 26 గేట్ల ద్వారా భారీగా నీటిని విడుదల చేసింది, వరద ప్రవాహం కొనసాగుతోంది, కృష్ణమ్మకి నీరు చేరుతోంది.

Nagarjuna Sagar Gates Opened | నాగార్జున సాగర్‌ 26గేట్ల నుంచి నీటి విడుదల

విధాత : నాగార్జునసాగర్‌ డ్యామ్‌కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. 2,58,707లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అంతే మొత్తంలో దిగువకు వెళ్తున్నది. స్పిల్‌ వే ద్వారా 2,03,502 లక్షల క్యూసెక్కులు వెళ్తుండగా, ఎడమ కాల్వకు 8280 క్యూసెక్కులు, విద్యుత్‌ కేంద్రానికి 34,185 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 587.40 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలకుగాను 305.7464 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

మరోవైపు జూరాల ప్రాజెక్టుకు 2,63,370 క్యూసెక్కుల వరద వస్తుండగా, 2,58,707 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతుండటంతో నాగార్జున సాగర్ జలాశయం కూడా గరిష్ట మట్టానికి చేరుకోవడంతో దిగువకు నీటి విడుదల చేపట్టారు. సాగర్ నుంచి వస్తున్న కృష్ఱ జలాలలో పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తుండగా..ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణమ్మ సముద్రంలోకి పరవళ్లు తొక్కుతుంది.