Krishna River Floods| ప్రాజెక్టులు బార్లా..సముద్రంలోకి కృష్ణమ్మ

భారీ వర్షాలు..వరదలతో కృష్ణానది..ఉప నదుల ప్రవాహం జోరందుకోవడంతో నది పరివాహకంలోని జూరాల ప్రాజెక్టు, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీలు గరిష్ట నీటి మట్టంకు చేరడంతో వాటి గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు.

Krishna River Floods| ప్రాజెక్టులు బార్లా..సముద్రంలోకి కృష్ణమ్మ

విధాత: భారీ వర్షాలు..వరదలతో కృష్ణానది..ఉప నదుల ప్రవాహం(Krishna River Floods)  జోరందుకోవడంతో నది పరివాహకంలోని జూరాల(Jurala) ప్రాజెక్టు, శ్రీశైలం(Srisailam Dam), నాగార్జున సాగర్(Nagarjuna Sagar), పులిచింతల(Pulichintala) ప్రాజెక్టు, ప్రకాశం(Prakasam)  బ్యారేజీలు గరిష్ట నీటి మట్టంకు చేరడంతో వాటి గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు వరదపోటెత్తడంతో 39 క్రస్టు గేట్లు ఎత్తారు. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 4.85 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, బయటకు 4.94 లక్షల క్యూసెక్కుల నీరు వెళ్తుంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 అడుగులు కాగా..ప్రస్తుతం 317.370 మీటర్ల వద్ద నీటి నిల్వ కొనసాగుతుంది. జూరాల నుంచి దిగువకు శ్రీశైలం జలాశయం చేరుకున్న కృష్ణమ్మ అక్కడి నుంచి ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో దిగువన నాగార్జున సాగర్ జలాశయానికి చేరుతుంది. శ్రీశైలం డ్యాంకు 6,01,898క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 5,35,649క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతుంది.

సముద్రంలోకి కృష్ణమ్మ

ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో మొత్తం 26క్రస్ట్ గేట్లు ఎత్తారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590.00 అడుగులు..ప్రస్తుత నీటి మట్టం 586.90 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 4,42,596 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 5,85,624 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. నాగార్జున సాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టుకు చేరిన కృష్ణా వరద ప్రవాహం..ప్రాజెక్టు 18గేట్లు ఎత్తడంతో దిగువన ప్రకాశం బ్యారేజీకి పరవళ్లు తొక్కుతుంది. అక్కడ ప్రకాశం బ్యారేజీ కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరడంతో అధికారులు సముద్రంలోకి నీటిని వదలడంతో కృష్ణమ్మ సముద్రంలో కలుస్తుంది. ప్రకాశం బ్యారేజీ వద్ధ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 6.2లక్షల క్యూసెక్కులుగా ఉండగా.. 6.5లక్షల క్యూసెక్కుల ప్రవాహం పెరుగనుందని అధికారులు తెలిపారు.