భారత్‌పై పాకిస్థాన్ క్షిపణులు, డ్రోన్లతో అటాక్.. మే 15వరకు ఆ.. 32ఎయిర్ పోర్టులు బంద్

- నియంత్రణ రేఖ వెంట కాల్పలు
- పంజాబ్ ఎయిర్ బేస్ ధ్వంసానికి యత్నం
- శ్రీగర్ ఎయిర్ పోర్టుపై దాడి
విధాత, న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ తో దెబ్బతిన్న పాకిస్తాన్ విచక్షణా రహితంగా భారత్ పై క్షిపణులు, డ్రోన్లతో దాడులు కొనసాగిస్తుంది. భారత్ లోని సైనిక స్థావరాలు, ఎయిర్ పోర్టులు, ఆసుపత్రులు, ప్రార్థనా మందిరాలు, విద్యా సంస్థలు లక్ష్యంగా 26చోట్ల పాక్ డ్రోన్, క్షిపణి దాడులకు పాల్పడింది. అయితే భారత సైన్యం ఎస్ 400సుదర్శన్, ఆకాశ్ ఢిఫెన్స్ వ్యవస్థలతో పాక్ దాడులను మధ్యలోనే అడ్డుకుని విఫలం చేశాయి. జమ్ము నుంచి గుజరాత్ వరకు పలుచోట్ల పాక్ దాడులకు పాల్పడింది.
శనివారం తెల్లవారుజామున శ్రీనగర్ విమానాశ్రయంపై.. ఎయిర్ బేస్‌పై పాక్ డ్రోన్లతో దాడి చేయగా భారత సైన్యం వాటిని తిప్పికొట్టింది. అమృత్‌సర్‌లోని ఖాసా కంటోన్మెంట్ గగనతలంలో భారత బలగాలు పాక్ డ్రోన్‌ను కూల్చివేశాయి. జైసల్మేర్ టార్గెట్‌గా పాక్ దాడులు చేసింది. జైసల్మేర్ కు 6 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గిడా గ్రామంలో మిస్సైల్స్ ను భారత ఆర్మీ కూల్చి వేసింది. జైసల్మేర్ వ్యాప్తంగా ఉదయం ప్రజలను ఇండ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో, జమ్మూలోని శంభూ ఆలయం సమీపంలోనూ కూల్చివేతకు గురైన పాక్ క్షిపణి శకలాలు లభ్యమయ్యాయి. అవంతిపురం సమీపంలో ఐదుసార్లు భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు అధికారులు పేర్కొన్నారు.
శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో క్షిపణి లాంటి వస్తువు పడినట్లు గుర్తించామన్నారు. చండీగఢ్‌లోనూ తెల్లవారుజామున పాక్ దాడులకు పాల్పడింది. పంజాబ్‌లోని బఠిండా, అమృత్ సర్ లో అధికారులు రెడ్ అలర్ట్ విధించారు. పఠాన్‌కోట్, శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో పేలుళ్ల జరిగాయి. ఈ పేలుళ్ల కారణంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పేలుళ్ల శబ్దం వినిపించిన వెంటనే ఆయా ప్రాంతాల్లో సైరన్లు మోగించి.. ప్రజలను అప్రమత్తం చేశారు. పాక్ దాడుల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో, బాల్కనీల్లో ఉండకుండా ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరించారు.
నియంత్రణ రేఖ వెంట పాక్ కాల్పులు
భారత్ పాక్ సరిహద్దు నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట పాక్ వరుస దాడులకు పాల్పడింది. జమ్మూ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న బీఎస్‌ఎఫ్ పోస్టులపై పాక్ రేంజర్స్ కాల్పులు దిగగా..భారత బలగాలు గట్టిగా తిప్పికొట్టాయి. పాక్ సైన్యం సరిహద్దుల దగ్గరికి భారీ సంఖ్యలో మోహరిస్తుండటంతో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. నియంత్రణ రేఖకు ఆవల పాకిస్థానీ పోస్టుల నుంచి డ్రోన్లు ప్రయోగిస్తుండటంతో ఆ పోస్టులను భారత ఆర్మీ ధ్వంసం చేసింది. పాక్ మిలిటరీ పోస్ట్‌ను.. టెర్రర్ లాంఛ్‌ప్యాడ్ ధ్వంసం చేశాయి. 3 పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌ల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించగా..శనివారం తెల్లవారుజామున పాకిస్థాన్‌లోని పలు వైమానిక స్థావరాల్లో శక్తిమంతమైన పేలుళ్లు సంభవించినట్లు సమాచారం. వీటిల్లో ఇస్లామాబాద్ సమీపంలో ఉన్న కీలక స్థావరంగా కూడా ఒకటిగా ఉంది.
పాక్ కాల్పుల్లో సీనియర్ అధికారి..జవాన్ మృతి
జమ్మూ కశ్మీర్ లోని రాజౌరీ జనావాస ప్రాంతాలపై పాకిస్తాన్ దళాలు జరిపిన కాల్పుల్లో ఆ రాష్ట్ర సీనియర్ అధికారి, జిల్లా అభివృద్ధి అదనపు కమిషనర్ రాజ్ కుమార్ తాప్పా ప్రాణాలు కోల్పోయారు. రాజ్ కుమార్ మృతి పట్ల సీఎం ఒమర్ అబ్దుల్లా సంతాపం వ్యక్తం చేశారు. నిన్ననే నా అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అధికారి ఈ రోజు లేకపోవడం విచారకరమన్నారు. పాక్ దళాల దుశ్చర్యకు ఇప్పటిదాకా రాజ్ కుమార్ సహా 20మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని..వారికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.10లక్షలు సహాయం అందిస్తుందన్నారు. జమ్మూలో సరిహద్దు వెంట పాక్ కాల్పుల్లో భారత వీర జవాన్ సచిన్ యాదవ్‌రావు వనాంజే (29) వీరమరణం పొందాడు.
మే 15వరకు 32ఎయిర్ పోర్టులు బంద్
సరిహద్దు రాష్ట్రాల్లో పాక్ దాడుల నేపథ్యంలో పౌరవిమానయాన సంస్థ 32ఎయిర్ పోర్టులను మూసివేసింది. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, జమ్మూకశ్మీర్ సహా పలు కీలక విమానాశ్రయాలు ఉన్నాయి. శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో పేలుళ్లు సంభవిస్తుండడంతో దానితో సహా ఉత్తర, పశ్చిమ భారత్‌లోని 32 విమానాశ్రయాలను ఈనెల 15 వరకు మూసివేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.