Kannappa: ప్రళయకాల రుద్రుడు.. త్రికాల మార్గదర్శకుడు

మంచు విష్ణు (Vishnu Manchu ) డ్రీమ్ ప్రాజెక్టుగా మవచు ఫ్యామిలీ నిర్మాణంలో ప్రతిష్టాల్మకంగా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప (Kannappa). ఒక్క టాలీవుడ్ నుంచే కాకుండా బాలీవుడ్, మలయాళం, తమిళ, కన్నడ భాషలన్నింటి నుంచి చాలామంది ప్రముఖ నటీనటులు ఈ మూవీలో కీలక పాత్రల్లో నటిస్తుండడం విశేషం. సుమారు రెండేండ్ల క్రితం షూటింగ్ ప్రారంభైన ఈ సినిమా పూర్తిగా న్యూజిలాండ్‌లో జరుపుకుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి గత మూడు నెలలుగా ఒక్కో కీలక పాత్రధారికి సంబంధించిన లుక్స్, వారి పాత్రలను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి ప్రళయకాల రుద్రుడు.. త్రికాల మార్గదర్శకుడు శివాజ్ఞ పరిపాలకుడు రుద్ర అంటూ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) లుక్‌ను రిలీజ్ చేశారు. కాగా ఈ మూవీలో మోహన్ లాల్ (Mohanlal), మోహన్ బాబు (Mohan Babu M), అక్షయ్ కుమార్ (Akshay Kumar), శివ రాజ్ కుమార్, శరత్ కుమార్, మధుబాల ఇతర పాత్రల్లో నటించారు.