Samantha | సమంత బ్రేక్ ఏమో గానీ.. ట్రీట్ మాత్రం అదిరిపోతోంది

Samantha విధాత‌: మనిషి శరీరానికే కాదు, మనసుకు కూడా శాంతి, విశ్రాంతి అవసరం, ఇప్పుడు సమంత చేస్తున్నది ఇదే.. రోజంతా బిజీ బిజీగా షూటింగ్ షెడ్యూల్స్‌తో తెగ హైరానా పడుతూ సాగే రొటీన్ జీవితానికి కాస్త బ్రేక్ ఇచ్చింది సమంత. అనారోగ్యం కారణంగా ట్రీట్మెంట్ కోసం వెళ్ళిందని చెబుతున్నా.. అలిసిన మనసును సేద తీర్చేందుకు వెళ్ళిందని తన తాజా పిక్స్ చూస్తే తెలుస్తుంది. సమంత నటిగా తెలుగు తెరపై బిజీ ఆర్టిస్ట్, అయితే తన సినిమాలన్నీ చాలా […]

  • By: krs    news    Aug 07, 2023 1:29 AM IST
Samantha | సమంత బ్రేక్ ఏమో గానీ.. ట్రీట్ మాత్రం అదిరిపోతోంది

Samantha

విధాత‌: మనిషి శరీరానికే కాదు, మనసుకు కూడా శాంతి, విశ్రాంతి అవసరం, ఇప్పుడు సమంత చేస్తున్నది ఇదే.. రోజంతా బిజీ బిజీగా షూటింగ్ షెడ్యూల్స్‌తో తెగ హైరానా పడుతూ సాగే రొటీన్ జీవితానికి కాస్త బ్రేక్ ఇచ్చింది సమంత. అనారోగ్యం కారణంగా ట్రీట్మెంట్ కోసం వెళ్ళిందని చెబుతున్నా.. అలిసిన మనసును సేద తీర్చేందుకు వెళ్ళిందని తన తాజా పిక్స్ చూస్తే తెలుస్తుంది.

సమంత నటిగా తెలుగు తెరపై బిజీ ఆర్టిస్ట్, అయితే తన సినిమాలన్నీ చాలా త్వరగా ఫినిష్ చేసి కొత్తగా ఒప్పుకున్న ప్రాజెక్ట్‌ల అడ్వాన్స్‌లు తిరిగి ఇచ్చేసి మరీ విదేశాలకు ప్రయాణం కట్టింది ఈ అమ్మడు. ఇలా సందు దొరికితే చాలు విదేశాలకు చెక్కేసే హీరో హీరోయిన్లు ఇండస్ట్రీలో చాలామందే ఉన్నా, సమంత కొన్ని రోజులుగా మయోసైటీస్ అనే వ్యాధితో పోరాడుతూనే.. ఇన్నాళ్ళూ సినిమాల్లో నటించి.. ఇప్పుడు ట్రీట్‌మెంట్ కోసం ట్రిప్ వేస్తోంది.

ఇక ఈ బిజీ లైఫ్ నుంచి కాస్త విరామం కావాలనుకుందో ఏమో చక్కగా ఇండోనేషియాలోని బాలికి చెక్కేసింది. అక్కడ చిన్నపిల్లలా గంతులేస్తూ, ఫోటోలకు ఫోజులిస్తుంది. తన క్యూట్ స్మైల్‌తో జనాల మతులు పోగొడుతుంది.

ఆమె షేర్ చేసే ఫొటోలకు నెటిజన్లు సైతం పాజిటివ్‌గానే స్పందిస్తుండటం విశేషం.
‘ఈ డ్రస్‌లో బావున్నావని, నవ్వు చాలా బావుందనే’ కామెంట్స్ రావడంతో తన డైలీ డైట్, తన జిమ్ వర్కవుట్స్ వీడియోలును రెగ్యులర్‌గా ఇన్ స్టా స్టోరీలో పెడుతుంది సమంత. అంతే కాకుండా ఆధ్యాత్మికంగానూ అడుగులువేస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోస్ కూడా ఆమధ్య నెట్టింట కనిపించాయి.

మనశ్శాంతిని వెతుకుతూ వెళితే దొరుకుతుందా.. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం మనలోనే ఉంది అనేవాళ్ళూ కూడా లేకపోలేదు. కాకపోతే సమంత ఉన్న పరిస్థితుల్లో డిప్రెషన్‌లోకి వెళ్ళడం కంటే ఇలా రకరకాల ప్రదేశాలను తిరిగిరావడమే మంచిదనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సమంత త్వరలోనే తన అనారోగ్యం నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగిరావాలని ఆశిద్దాం.