Cabinet Decisions | కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం.. 2 వేల మందికి ఉద్యోగాలు
ఉత్తరప్రదేశ్‌లో రూ.3,707 కోట్ల పెట్టుబడితో సెమీ కండక్టర్ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతున్నది. హోన్ హాయ్ టెక్నాలజీ’ గ్రూప్నకు చెందిన ‘ఫాక్స్కాన్’.. హెచ్సీఎల్ సంయుక్త ఆధ్వర్వంలో ఈ సెమీ కండక్టర్ ఏర్పాటు చేయబోతున్నారు.

- యూపీలో సెమీ కండక్టర్ యూనిట్
- రూ.3,707 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు
- ‘ఫాక్స్‌కాన్, హెచ్సీఎల్ సంయుక్త ఆధ్వర్వంలో..
- వివరాలు వెల్లడించిన మంత్రి అశ్వినీ వైష్ణవ్
Cabinet Decisions | కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. మరో సెమీ కండెక్టర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో రూ.3,707 కోట్ల పెట్టుబడితో సెమీ కండక్టర్ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతున్నది. హోన్ హాయ్ టెక్నాలజీ’ గ్రూప్నకు చెందిన ‘ఫాక్స్కాన్’.. హెచ్సీఎల్ సంయుక్త ఆధ్వర్వంలో ఈ సెమీ కండక్టర్ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మేరకు బుధవారం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని జెవార్ విమానాశ్రయం సమీపంలో ఈ సెమీ కండక్టర్ ఏర్పాటు చేయబోతున్నారు. దీని ద్వారా 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.
మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్స్, ఆటోమొబైల్స్, కంప్యూటర్స్, ఇతర డిస్పేలు ఉన్న పరికరాలకు అవసరమైన “డిస్ప్లే డ్రైవర్ చిప్”ల తయారీకి ఈ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. ప్రతి నెల 20,000 “వెఫర్లు” ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంటుంది. నెలవారీగా 36 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయనున్నారు. ఇప్పటికే దేశంలో ఐదు సెమీకండక్టర్లు ఉన్నాయి. ఇది ఆరో యూనిట్. సెమీ కండక్టర్ యూనిట్లలో ప్రతినెలా 3.6 కోట్ల చిప్స్‌ను ఉత్పత్తి చేస్తామని పేర్కొన్నారు.
కండక్టర్లకు ఉపయోగించే పరికరాలను సైతం భారతదేశంలోనే తయారు చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రస్తుతం సుమారు 60% సెమీకండక్టర్ల పరికరాలను అమెరికా కంపెనీలే తయారు చేస్తున్నాయన్నారు. ఈ సాంకేతికతపై సుమారు 70 సార్టప్స్ పని చేస్తున్నాయని వెల్లడించారు. కొత్త విద్యా విధానం ద్వారా అకడమిక్ విద్య, పరిశ్రమల అనుసంధానానికి అవకాశాలు ఉన్నాయన్నారు. పరిశ్రమల అవసరాల మేరకు విద్యార్థులు సన్నద్ధం అవుతున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా 270 విద్యా సంస్థల్లో విద్యార్థులకు సెమీ కండక్టర్ల సాంకేతికతపై శిక్షణనిస్తున్నట్లు తెలిపారు.