Foxconn | తెలంగాణకు పెద్ద దెబ్బ – కర్ణాటకు తరలిపోయిన ఫాక్స్​కాన్​

తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల సహాయసహకారాలు అందజేస్తామని మాట ఇచ్చినప్పటికీ, ఫాక్స్​కాన్​ సంస్థ తన విద్యుత్​ వాహన విడిభాగాల తయారీ ప్లాంటును కర్ణాటకలో నెలకొల్పడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది.

Foxconn | తెలంగాణకు పెద్ద దెబ్బ – కర్ణాటకు తరలిపోయిన ఫాక్స్​కాన్​

ప్రపంచంలో అతిపెద్ద ఐఫోన్​ తయారీదారు ఫాక్స్​కాన్(Foxconn)​, తను కొత్తగా తయారుచేయబోయే ఎలక్ట్రిక్​ వాహన యంత్ర విడిభాగాల తయారీ, అసెంబ్లీ (mechanical components in electric vehicle) యూనిట్​ను ఏర్పాటు చేయడానికి కర్ణాటక(Karnataka)ను ఎంపిక చేసుకుంది. ప్రాజెక్ట్​ చీతా(Project Cheetah) పేరుతో నెలకొల్పబోయే ఈ ప్లాంట్​ చైనా ప్లాంట్ తర్వాత అతి పెద్దది. తైవాన్​ కంపెనీ హోన్​ హయ్​ టెక్నాలజీ గ్రూప్​( Hon Hai Technology Group )కు చెందిన ఫాక్స్​కాన్​, దొడ్డబళ్లాపూర్​( Doddaballapur )లో రూ.25వేల కోట్లతో ఈ ప్లాంట్​ నెలకొల్పనుంది.

ఫాక్స్​కాన్​ ఛైర్మన్​ యూంగ్​ లియూ(Young Liu )తో చర్చల అనంతరం, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Siddaramaiah) మాట్లాడుతూ, ప్రభుత్వం ఫాక్స్​కాన్​కు పూర్తి సహాయసహకారాలు అందజేస్తుందని, నీరు, విద్యుత్​, రహదారుల దగ్గర్నుంచీ న్యాయసేవలు కూడా అందిస్తామని ఆయన స్పష్టం చేసారు. బెంగళూరు రూరల్​ జిల్లాలోని దేవనహళ్లి తాలూకా, దొడ్డబళ్లాపూర్​ ఐటీఐఆర్​ ప్రారిశ్రామిక ప్రాంతంలో ఫాక్స్​కాన్​కు 300 ఎకరాల భూమిని కేటాయించారు. ఈ ప్రాజెక్ట్​ వల్ల 50 వేల ఉద్యోగాలు(50 Thousand Jobs) వస్తాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

అనంతరం, ఫాక్స్​కాన్​ ఛైర్మన్​ యూంగ్​ లియూ మాట్లాడుతూ, త్వరలో ఈ ప్లాంట్​, చైనాలోని ప్లాంట్​ తర్వాత అతిపెద్దది(second-largest Foxconn plant after China’s unit)గా మారబోతోందని, దాదాపు 40వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పిస్తుందని తెలిపారు. అవి కూడా ప్రత్యేకించి మధ్యస్తంగా చదువుకున్నవారికే(middle-level educated individuals)నని చెప్పిన లియూ, ఇది ఇక్కడితో ఆగదని, తాము మరిన్నిరంగాల్లోకి విస్తరించడానికి ప్రణాళికలు రచిస్తున్నామని, పరస్పర విశ్వాసముంటే ఏదైనా సాధించవచ్చని ఆయన ధీమా వ్యక్తం చేసారు.

ఫాక్స్​కాన్​కు ఇదివరకే దొడ్డబళ్లాపూర్​లో ప్రాజెక్ట్​ ఎలిఫెంట్​(Project Elephant) పేరుతో 300 ఎకరాల విస్తీర్ణంలో ఒక ప్లాంట్​ ఉంది. దాని తర్వాత ఇది రెండోది. ఈ రోజు ఫాక్సకాన్​ ప్రతినిధులు తమ ప్లాంట్​ను సందర్శించే అవకాశముంది. అక్కడ ప్లాంట్​ నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి.

ఆశ్చర్యకరంగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి(Telangana CM Revanth Reddy), పరిశ్రమల శాఖామంత్రి శ్రీధర్​బాబుతో కలిసి, ఢిల్లీలో ఫాక్స్​కాన్​ ఛైర్మన్​తో సమావేశమైన(Meeting with Foxconn Chairman) మర్నాడే ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా తమ రాష్ట్రంలో ప్లాంట్​ నెలకొల్పాలనే నిర్ణయం తీసుకుంటే అన్నివిధాల సహాయసహకారాలందిస్తామని వారికి హామీ ఇచ్చారు. సమాధానంగా యూంగ్​ లియూ కూడా తెలంగాణను సందర్శిస్తానని ముఖ్యమంత్రికి మాటిచ్చారు. అదేరోజు బెంగళూరు వెళ్లిపోయిన ఫాక్స్​కాన్​ బృందం సాయంత్రం ముఖ్యమంత్రితో సమావేశం కావడం, అది పూర్తయిన వెంటనే సిద్దరామయ్య ఫాక్స్​కాన్​ రెండో ప్లాంట్​ గురించిన సమాచారాన్ని విడుదల చేసారు.

మార్చి 2, 2023న, అప్పటి తెలంగాణ ప్రభుత్వం(CM KCR)తో ఫాక్స్​కాన్​ ఒక ఒప్పందాన్ని ఖరారు చేసుకుని, మూడు వారాల్లోపే, మార్చి 15న కొంగరకలాన్(Kongar Kalan)​లో ప్లాంట్​కు భూమిపూజ (Groud-Breaking Ceremony)చేసింది. అక్కడ యాపిల్​ ఎయిర్​పాడ్స్​ తయారుచేస్తారని తెలిపింది. ఇందుకోసం 500 మిలియన్​ డాలర్లు($500 Million) వెచ్చించిన ఫాక్స్​కాన్​, దీని ద్వారా 25వేల మంది(25 Thousand Jobs)కి ఉద్యోగాలు కల్పిస్తామని, ఇది ఇంకా పెరుగుతాయని చెప్పింది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి.