Mohanbabu: కోర్టును తప్పుదోవ పట్టించారంటూ ఆధారాలు.. ఎల్బీనగర్ కోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు!

విధాత: టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుకు తన జల్ పల్లి నివాసంపై కొనసాగుతున్న వివాదంలో చుక్కెదురైంది. జల్ పల్లి ఇంటి వివాదంపై చిన్న కొడుకు మంచు మనోజ్ తో నెలకొన్న వివాదంతో మోహన్ బాబు గతంలో కోర్టుకు వెళ్లారు.
గతంలో కోర్టు మోహన్ బాబుకు అనుకూలంగా తీర్పు నిచ్చింది. అయితే మంచు మనోజ్ తరుపు న్యాయవాది.. మోహన్ బాబు కోర్టును తప్పుదోవ పట్టించారంటూ కొన్ని ఆధారాలను సమర్పించారు. వాటిని విచారించిన ఎల్బీనగర్ కోర్టు మోహన్ బాబుకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ తాజా తీర్పు వెలువరించింది. ఈ వివాదంలో పొరపాటుకు పాల్పడిన కోర్టు క్లర్క్ కు మెమో జారీ చేసింది. మరోవైపు జల్ పల్లి నివాసం వద్ధ బుధవారం మంచు మనోజ్ ధర్నాకు దిగడం హాట్ టాపిక్ గా మారింది.