SIT | ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు సిట్ నోటీసు

SIT | ఆంధ్రజ్యోతి దిన పత్రిక చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మీ ఫోన్ నెంబర్లను కూడా ట్యాపింగ్ చేశారని సిట్ అధికారులు బుధవారం ఆయనకు సమాచారం ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపిస్తే, వీలును బట్టి వచ్చి వాంగ్మూలం ఇస్తానని వేమూరి రాధాకృష్ణ సిట్ అధికారులకు తెలిపారు. అప్పట్లో ఆంధ్రజ్యోతితో పాటు ఒకటి రెండు దిన పత్రికలు, తెలుగు మీడియా చానళ్లకు చెందిన యజమానులు, సీనియర్ జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.