ధర్మ తాళ్ళగూడెం వద్ద ఎన్‌కౌంటర్ ఆరుగురు మావోయిస్టులు మృతి

విధాత: చత్తీస్‌ఘడ్ బీజాపూర్ జిల్లా అడవుల్లో గురువారం ఎన్‌కౌంటర్ జరిగినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ సంఘటనలో ఆరుగురు మావోయిస్టుల మృతి చెందినట్లు సమాచారం. బీజాపూర్ జిల్లాలోని ధర్మ తాళ్ళగూడెం వద్ద ఈ సంఘటన జరిగినట్లు చెబుతున్నారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఎన్కౌంటర్‌లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రాంతంలో కూడా భారీ ఎత్తున మోహరించిన సాయుధ బలగాలతో ఎప్పుడూ ఏం జరుగుతుందో అనే ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతుంది.