27 ఏండ్ల తర్వాత నేడు సూర్యగ్రహణం.. ఎక్కడెక్కడ కనిపిస్తుందంటే?
Solar Eclipse |విధాత: మంగళవారం 25వ తేదీన (ఈ రోజు) పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. అంతే కాకుండా 27 ఏండ్ల తర్వాత దీపావళి రోజునే సూర్యగ్రహణం ఏర్పడటం విశేషం. ఇలాంటి పాక్షిక సూర్యగ్రహణాన్ని చూడాలంటే మరో పదేండ్లు అంటే 2032 వరకు ఆగాల్సిందే. అమావాస్య రోజు సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే కక్ష్యలోకి రావడం వల్ల పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఈ సూర్య గ్రహణం అక్టోబర్ 25న సాయంత్రం 4.29 గంటలకు […]

Solar Eclipse |విధాత: మంగళవారం 25వ తేదీన (ఈ రోజు) పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. అంతే కాకుండా 27 ఏండ్ల తర్వాత దీపావళి రోజునే సూర్యగ్రహణం ఏర్పడటం విశేషం. ఇలాంటి పాక్షిక సూర్యగ్రహణాన్ని చూడాలంటే మరో పదేండ్లు అంటే 2032 వరకు ఆగాల్సిందే.
అమావాస్య రోజు సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే కక్ష్యలోకి రావడం వల్ల పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఈ సూర్య గ్రహణం అక్టోబర్ 25న సాయంత్రం 4.29 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 5.42 గంటలకు ముగుస్తుంది.
అంటే దాదాపు 1.15 నిమిషాల పాటు గ్రహణం భారతదేశంతో పాటు ఇది ఐరోపా, ఆఫ్రికా ఖండంలోని ఈశాన్య భాగం, ఆసియాలోని నైరుతి భాగం, అట్లాంటిక్‌లో కూడా కనువిందు చేయనుంది.
సూర్యగ్రహణం.. హైదరాబాద్‌లో ఏ సమయంలో కనిపిస్తుందంటే..?
ఈ సంవత్సరం రెండు సూర్య, రెండు చంద్ర గ్రహణాలు మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఇప్పటికే ఒక సూర్యగ్రహణం, ఒక చంద్రగ్రహణం ఏప్రిల్, మే నెలలో ఏర్పడ్డాయి.
అయితే, ఈ గ్రహణాలు 15 రోజుల వ్యవధిలోనే సంభవించాయి. ప్రస్తుతం కూడా అదే విధంగా రెండు వారాల వ్యవధిలోనే మళ్లీ రెండు గ్రహణాలు సంభవించడం గమనార్హం. అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం ఏర్పడుతున్నాయి.
25న సూర్యగ్రహణం.. ఈ పనులు అసలు చేయకూడదు..
పాక్షిక గ్రహణం అంటే ఏమిటి?
సూర్యచంద్రులు ఒకే కక్ష్యలో ఉంటారు. సూర్యుడి నీడ భూమి మీద పడకుండా చంద్రుడు పాక్షికంగానే అడ్డుకుంటాడు. అప్పుడు ఏర్పడే గ్రహణాన్ని పాక్షిక సూర్య గ్రహణం అని అంటారు.
దీపావళి రోజున సూర్యగ్రహణం.. ఈ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే..?
ఫేస్బుక్‌లో అశ్లీల ఫొటోలు: స్పందించిన విష్ణుప్రియ.. అసలు విషయం ఏంటంటే?
