ఎస్‌వి ప్రసాద్ మృతి దిగ్భ్రాంతి కలిగించింది..నారా చంద్రబాబునాయుడు
విధాత:సీనియర్ ఐఏఎస్ అధికారి ఎన్.వి.ప్రసాద్ మృతిపట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమాల్లో అందరినీ ముందుండి నడిపే అధికారిగా చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన అకాల మరణం తీరనిలోటన్నారు. నిత్యం అందుబాటులో ఉంటూ అంకిత భావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించారని కొనియాడారు. కరోనా వ్యాధిని జయించి తిరిగి వస్తారని అనుకున్నామని ఇప్పుడు లేరంటే నమ్మలేకపోతున్నామని అన్నారు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శిగా ,విజిలెన్స్ కమిషనర్‌గా ఎస్వీ ప్రసాద్ […]

విధాత:సీనియర్ ఐఏఎస్ అధికారి ఎన్.వి.ప్రసాద్ మృతిపట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమాల్లో అందరినీ ముందుండి నడిపే అధికారిగా చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన అకాల మరణం తీరనిలోటన్నారు. నిత్యం అందుబాటులో ఉంటూ అంకిత భావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించారని కొనియాడారు. కరోనా వ్యాధిని జయించి తిరిగి వస్తారని అనుకున్నామని ఇప్పుడు లేరంటే నమ్మలేకపోతున్నామని అన్నారు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శిగా ,విజిలెన్స్ కమిషనర్‌గా ఎస్వీ ప్రసాద్ విశేషమైన సేవలందించారు. ఏపీ జెన్‌కో చైర్మన్‌గా, ఏపీఎస్ ఆర్టీసీ వైస్‌చైర్మన్‌గా ఆయా సంస్థల బలోపేతం కోసం కృషి చేశారు. ఎస్వీ ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.