TATA: టాటా స్టీల్ మరో ఘనత.. FY 25లో భారీగా ఉత్పత్తులు, విక్రయాలు

జంషెడ్‌పూర్: టాటా స్టీల్ ట్యూబ్స్ విభాగం FY-25లో ఒక మిలియన్ టన్నుల ఉత్పత్తి, విక్రయాల మైలురాయిని దాటి, దేశంలో అత్యంత వైవిధ్యమైన ట్యూబ్స్ సంస్థగా నిలబడింది. పెద్ద ఎత్తున నిర్మాణాలు, మెట్రోలు, విమానాశ్రయాలు, రైల్వేలతో సహా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నుండి, గిడ్డంగుల వంటి పారిశ్రామిక కార్యకలాపాల వరకు టాటా స్టీల్ ట్యూబ్స్ విస్తృత ఉపయోగాలను కలిగి ఉంది. ఈ ఉత్పత్తులను అనేక రంగాల్లో ఉపయోగిస్తున్నారు. డోర్, విండో ఫ్రేమ్‌లు, హ్యాండ్‌రైల్స్, అధిక నిష్పత్తి ట్యూబ్స్ వంటి ఉత్పత్తులను టాటా పరిచయం చేసింది.
టాటా స్టీల్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాత్ కుమార్ మాట్లాడుతూ.. “ఒక మిలియన్ టన్నుల మైలురాయిని దాటడం మా నిరంతర ఆవిష్కరణ, కార్యాచరణ శ్రేష్ఠత, కస్టమర్ కేంద్రీకృత విధానాలకు నిదర్శనం. మా వైవిధ్యమైన ఉత్పత్తి విలువ ఆధారిత పరిష్కారాల విస్తరణ అభివృద్ధి చెందుతున్న వివిధ పరిశ్రమల అవసరాలను తీర్చడానికి ఉపయోగపడుతోంది. ఈ మైలురాయి దేశ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధికి కొనసాగించే మా సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది” అని అన్నారు.