Rain Dreams | కలలో వర్షం కనిపిస్తే.. ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందట..!
Rain Dreams | కునుకు తీస్తే చాలు.. రకరకాల కలలు( Dreams ) పడుతుంటాయి. కొన్ని భయంకరంగా ఉంటాయి.. ఇంకొన్ని ఊహాల్లో విహారించే కలలు ఉంటాయి. మరి ముఖ్యంగా వర్షం( rain ) కలలో కనిపిస్తే.. ఆ వ్యక్తి జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నట్టు అర్థం చేసుకోవాలి.

Rain Dreams | పగలు, రాత్రి వేళలో కునుకు తీస్తే చాలు.. కలలు( Dreams ) వస్తుంటాయి. ఆ కలలు గతంలో మనకు ఎదురైనవి కావొచ్చు.. భవిష్యత్‌లో జరగబోయేవి కావొచ్చు. ఇలా వచ్చే కలలు చాలా వరకు నిజమవుతాయని నమ్ముతుంటారు. అయితే ఈ కలల్లో కొన్ని శుభ సంకేతాలను సూచిస్తే, మరికొన్ని అశుభ సంకేతాలను సూచిస్తాయి. స్వప్న శాస్త్రం ప్రకారం.. వర్షం( Rain ) పడుతున్నట్టు కల వస్తే.. శుభంగా భావించాలని స్వప్న శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఇలా కలలో వర్షం కనిపించడం అనేది.. శుభవార్తలను తీసుకొస్తుందని చెబుతున్నారు. జీవితంలో కూడా ఏదో గొప్ప మార్పుకు నాంది పలుకుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఇక వారి జీవితంలో మంచి రోజులు ప్రారంభం అయ్యాయని అర్థం చేసుకోవాలి.
వర్షం కల వల్ల కలిగే శుభాలు ఇవే..
రాత్రి వేళ నిద్రించే సమయంలో కలలో వర్షం కనిపిస్తే.. త్వరలోనే శుభవార్తలు వింటామని అర్థం.
ఆర్థిక లాభాలు కలిగి.. అప్పుల నుంచి విముక్తి పొందుతామని అర్థం.
కలలో వర్షం కనిపించడం.. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు రాకను సూచిస్తుంది.
కెరీర్‌లో విజయం, పురోగతికి సంకేతంగా చూడొచ్చు.
కలలో వర్షం కనిపించడం అనేది నెరవేరని కోరికలు త్వరలో నెరవేరుతాయని అర్థం.
కలలో భారీ వర్షంలో తడిసిపోతున్నట్లు చూస్తే.. అది ఆర్థిక లాభం, కెరీర్‌లో విజయం, జీవితంలో ఆనందానికి సంకేతంగా భావించాలి.