Tecno Spark 50 5G | గూగుల్ పిక్సెల్ కెమెరా డిజైన్‌తో టెక్నో స్పార్క్ 50.. రూ.17 వేలకే!!
Tecno Spark 50 5G | స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో (Tecno) తన కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ టెక్నో స్పార్క్ 50 మోడల్‌ను విడుదల చేసింది. గత ఏడాది వచ్చిన Spark 40 4జీ మొబైల్‌కు కొనసాగింపుగా ఈ మోడల్‌ను తీసుకొచ్చింది
Tecno Spark 50 5G | స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో (Tecno) తన కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ టెక్నో స్పార్క్ 50 మోడల్‌ను విడుదల చేసింది. గత ఏడాది వచ్చిన Spark 40 4జీ మొబైల్‌కు కొనసాగింపుగా ఈ మోడల్‌ను తీసుకొచ్చింది. గూగుల్ పిక్సెల్ ప్రేరేపిత కెమెరా డిజైన్‌తో పాటు పవర్‌ఫుల్ బ్యాటరీ, మెరుగైన పనితీరుతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ మొబైల్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా బడ్జెట్ సెగ్మెంట్‌లో 5జీ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి ఎంపికగా మారనుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
గూగుల్ పిక్సెల్ తరహాలో కెమెరా డిజైన్
ఈ Tecno Spark 50 5G స్మార్ట్‌ఫోన్‌లో ఫొటోగ్రఫీ కోసం 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అమర్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను ఇచ్చారు. గూగుల్ పిక్సెల్ తరహాలో కెమెరాను రూపొందించడం ఈ ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
6500mAh శక్తివంతమైన బ్యాటరీ
ఇక ఈ మొబైల్‌లో 6500mAh సామర్థ్యం ఉన్న భారీ బ్యాటరీని అందించారు. 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు కూడా ఇందులో ఉంది. దీనివల్ల తక్కువ సమయంలోనే ఫుల్ చార్జింగ్ అవుతుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. అలాగే IP64 రేటింగ్‌తో దుమ్ము, నీటి నిరోధకత లభిస్తుంది.
ఇతర స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.78 అంగుళాల HD+ డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్ కారణంగా స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం స్మూత్‌గా ఉంటుంది. గరిష్టంగా 560 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్టు చేయడం వల్ల పగటిపూట బయట ప్రాంతాల్లో కూడా డిస్‌ప్లే స్పష్టంగా కనిపిస్తుంది. డిజైన్ పరంగా చూస్తే ఫ్లాట్ ప్రేమ్‌తో పాటు వెనుక భాగంలో పిల్ షేప్ కెమెరా మాడ్యుల్‌ను ఏర్పాటు చేశారు. పవర్, వాల్యూమ్ బటన్లనున ఫోన్ కుడివైపు ఇచ్చారు.
పర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది రోజువారీ పనులతో పాటు మల్టీ టాస్కింగ్‌కు సరిపోతుంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16పై పనిచేస్తుంది.
కనెక్టివిటీ, ఇతర ఫీచర్లు
ఈ ఫోన్‌లో UPS 3.0 టెక్నాలజీని అందించారు. ఇది నెట్‌వర్క్ కవరేజ్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా UPI వంటి డిజిటల్ చెల్లింపులను రెట్టింపు వేగంతో చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇందులో 4×4 MIMO సపోర్టు కూడా ఉంది. దీనిలో మరో అత్యంత ప్రత్యేకమైన ఫీచర్ కూడా ఉంది. అదే నో నెట్‌వర్క్ కమ్యూనికేషన్. ఇది సెల్యూలర్ నెట్‌వర్క్ లేదా వైఫై అవసరం లేకుండా 1.5కిలోమీటర్ల దూరం వరకు అనుకూలమైన పరికరాల మధ్య ఆఫ్‌లైన్ కమ్యూనికేషన్‌ను సాధ్యం చేస్తుంది.
ధర – కలర్ ఆప్షన్లు
ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్యాంటసీ పర్పుల్, మింట్ గ్రీన్, ఇంక్ బ్లాక్, షాంపైన్ గోల్డ్ వంటి నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. ఇక ఇది రెండు వేరియంట్లలో అందుబాటులోకి వస్తుంది. 4జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మొబైల్ ధరను రూ.16,999గా నిర్ణయించారు. 6జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మొబైల్ ధరను రూ.18,999గా నిర్ణయించారు. ఈ మొబైల్ ఏప్రిల్ 3వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ వెబ్‌సైట్‌తో పాటు దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది.
Read More:
7000mAh బ్యాటరీ, 200మెగాపిక్సెల్ కెమెరాతో వివో మొబైల్.. లాంచ్ ఎప్పుడంటే..!
సెల్ఫీ మిర్రర్‌తో భారత్‌లో తొలి ఫోన్.. 7000mAh భారీ బ్యాటరీతో రియల్‌మీ సర్‌ప్రైజ్!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram