తెలంగాణకు 2,000 మెట్రిక్ టన్నులకుపైగా ఆక్సిజన్
వైద్య ఆక్సిజన్ సరఫరా చేసిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు22 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా 113 ట్యాంకర్లలో 2,026 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎమ్‌ఓ చేరవేత మొదటి 1000 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎమ్‌ఓ సరఫరాకు 23 రోజులు పడితే,మరో 1000 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎమ్‌ఓ సరఫరా 8 రోజులలో పూర్తి విధాత:దేశానికి గుండెకాయ లాంటి భారతీయ రైల్వే నూతన అన్వేషణలతో దేశానికి అనేక విధాలుగా నిరంతరంగా సేవలందిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి వేగ వంతంగా వైద్య ఆక్సిజన్‌ను సరఫరా చేస్తోంది. […]

వైద్య ఆక్సిజన్ సరఫరా చేసిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు22 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా 113 ట్యాంకర్లలో 2,026 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎమ్‌ఓ చేరవేత
మొదటి 1000 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎమ్‌ఓ సరఫరాకు 23 రోజులు పడితే,
మరో 1000 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎమ్‌ఓ సరఫరా 8 రోజులలో పూర్తి
విధాత:దేశానికి గుండెకాయ లాంటి భారతీయ రైల్వే నూతన అన్వేషణలతో దేశానికి అనేక విధాలుగా నిరంతరంగా సేవలందిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి వేగ వంతంగా వైద్య ఆక్సిజన్‌ను సరఫరా చేస్తోంది. ఊహించని అనేక సవాళ్లను అధిగమిస్తూ తెలంగాణ రాష్ట్రానికి 2 జూన్ 2021 తేదీ నాటికి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా 2,026 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను (ఎల్‌ఎమ్‌ఓ) రైల్వే ద్వారా విజయవంతంగా సరఫరా చేయబడిరది.
భారత రైల్వే ద్వారా నిరంతరంగా రాష్ట్రానికి తక్కువ సమయంలోనే వైద్య ఆక్సిజన్ సరఫరా చేయబడిరది. మొదటి 1000 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎమ్‌ఓ సరఫరాకు 23 రోజులు పడితే, మరో 1000 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎమ్‌ఓను 8 రోజుల్లోనే సరఫరా చేసింది. రాష్ట్ర ఆక్సిజన్ అవసరాలు తీర్చడానికి హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌కు మొత్తం 22 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు ఆక్సిజన్‌ను సరఫరా చేశాయి. ఈ రైళ్లలో 113 ట్యాంకర్లలో వైద్య ఆక్సిజన్‌ను నింపుకొని తీసుకురాబడిరది.
రాష్ట్రానికి కావాల్సిన వైద్య ఆక్సిజన్ అవసరాలను తీర్చడానికి దేశంలోని తూర్పు మరియు పశ్చిమ ప్రాంతాల నుండి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు వచ్చాయి. ఒడిస్సా నుండి 16 రైళ్లు రాగా, జార్ఖండ్ నుండి మరో 4 రైళ్లు, గుజరాత్ నుండి 2 రైళ్లు నడిచాయి.
రాష్ట్రాలకు ఆక్సిజన్ అవసరాలను వీలైనంత త్వరాగా తీర్చేలా తక్కువ సమయంలో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు గమ్యం స్థానాలకు చేరేలా రైల్వే గ్రీన్ కారిడార్లను ఏర్పాటు చేసింది. ఆక్సిజన్ రైళ్లు వీలైనంత త్వరగా చేరేలా పర్యవేక్షణకు రైల్వేలో వివిధ విభాగాలలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. వీటి ఫలితంగా, ఈ రైళ్లు సగటున గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాయి.
తెలంగాణ రాష్ట్రానికి 2000 మెట్రిక్ టన్నులకు పైగా వైద్య ఆక్సిజన్ చేరవేయడంలో కృషి చేసిన అధికారులను మరియు సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రాలకు వైద్య ఆక్సిజన్ సరఫరా చేసేందుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ రైళ్లను వీలైనంత వేగంగా నడుపుతున్నట్టు ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్ల నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగేలా ఇదే తరహ పర్యవేక్షణను ఇక మీదట కూడా కొనసాగించాలని ఆయన రైల్వే బృందాలకు సూచించారు.