మధ్యధరా సముద్రం దాటుతూ.. 2,500 మంది శరణార్థులు మృతి
- మధ్యధరా సముద్రం దాటి యూరప్
- దేశాలకు1.86 లక్షల మంది శరణార్థులు
- భద్రతా మండలికి అమెరికా శరణార్థి ఏజెన్సీ వెల్లడి
విధాత: మధ్యధరా సముద్రం దాటి యూరప్‌కు వెళ్లేందుకు ప్రయత్నించి ఈ ఏడాది ఇప్పటివరకు 2,500 మందికిపైగా శరణార్థులు మరణించారు. ఇదే సమయంలో సుమారు 1,86,000 మంది శరణార్థులు యూరోపియన్ దేశాలకు చేరుకున్నారు. ఈ విషయాన్ని భద్రతా మండలికి అమెరికా శరణార్థి ఏజెన్సీ వెల్లడించింది.
ఈ ఏడాది ప్రమాదకరమైన మధ్యధరా సముద్రం దాటే క్రమంలో ఈ నెల 24 నాటికి 2,500 మందికిపైగా మరణించారని లేదా తప్పిపోయారని న్యూయార్క్‌లోని ఐక్య రాజ్యసమితి (యూఎన్) హైకమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ (UNHCR) కార్యాలయం డైరెక్టర్ రువెన్ మెనిక్డివేలా గురువారం భద్రతా మండలికి చెప్పారు. ఇదే తొమ్మిది నెలల సమయంలో 1.86 లక్షల మంది యూరోపియన్ దేశాలకు చేరుకున్నారని తెలిపారు. ఇందులో (సుమారు 83 శాతం) దాదాపు 1.30 లక్షల మంది ఇటలీకి చేరుకున్నారని వెల్లడించారు.
మిగతా 17 శాతం మంది శరణార్థులు గ్రీస్, స్పెయిన్, సైప్రస్, మాల్టా దేశాలకు వెళ్లినట్టు తెలిపారు. 2022లో అదే కాలంలో 1,680 మంది చనిపోగా, ఈ ఏడాది వారి సంఖ్యకు 2,500 కు పెరిగినట్టు వివరించారు. సముద్ర, భూ మార్గాల్లో యూరప్ దేశాలకు వెళ్లే క్రమంలో చనిపోయేవారి సంఖ్య ప్రతిఏటా పెరుగుతున్నదని తెలిపారు. దీనికి కనుచూపులో మేరలో అంతం కనిపించడంలేదని మెనిక్డివెలా తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram