Telangana rain: తెలంగాణలో మరో ఐదురోజులు వానలు – వాతావరణశాఖ
Telangana rain: తెలంగాణ రాష్ట్రంలో మరో ఐదు రోజులు వర్షాలు కురవబోతున్నాయని వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రానికి ఈ ఏడాది కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత వాటి ప్రభావం తగ్గిపోయింది. ఎండాకాలం లాగానే పరిస్థితి మారిపోయింది.
కాగా రాష్ట్రంలో మరో ఐదురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం ఏర్పడ్డ ఉపరితల ద్రోణి ప్రభావంతో రానున్న ఐదురోజుల్లో వర్షాలు కురవబోతున్నట్టు సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ద్రోణి బలపడటంతో వర్షాలు కురవబోతున్నాయని పేర్కొన్నది.
ఈ జిల్లాల్లోనే నేడు వర్షాలు ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్ సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram