తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదల

తెలంగాణలో పదవ తరగతి ఫలితాలను విడుదల చేశారు. 95.15శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఎన్సీఆర్టీ ప్రాంగణంలోని గోదావరి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు ఫలితాలను విడుదల చేశారు.

తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు విడుదల

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో పదవ తరగతి ఫలితాలను విడుదల చేశారు. 95.15శాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం. ఎన్సీఆర్టీ ప్రాంగణంలోని గోదావరి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు ఫలితాలను విడుదల చేశారు. గ్రేడ్లుగా కాకుండా సబ్జెక్టుల వారిగా మార్కులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు పీవీ శ్రీహరి పాల్గొన్నారు. ఫలితాలను results.bsetelangana.org, results.bse.telangana.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. ఫలితాల కోసం పాస్ వర్డు gdlk@ssc26 పేర్కొన్నారు.

తొలి సారిగా వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు వెల్లడించారు. వాట్సాప్నెంబర్ 80969 58096కు Hi అని మెసేజ్ పంపి ఫలితాలు తెలుసుకోవచ్చు.

మార్చి 14నుంచి ఏప్రిల్ 13వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు 5,17లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. 4,97,312 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలలో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 96.26శాతం, బాలురు 94.07శాతం ఉత్తీర్ణత సాధించారు.

వివిధ పాఠశాలల వారిగా ఫలితాలను వెల్లడించారు.5,371పాఠశాలల్లో 100శాతం ఉత్తీర్ణత సాధించారు. ఆరు పాఠశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత వచ్చిందని అధికారులు తెలిపారు. ములుగు జిల్లాలో అత్యధికంగా 99.30శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 89.23శాతం ఉత్తీర్ణత సాధించారు జూన్ 5నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫీజును చెల్లించేందుకు ఈ నెల 30 నుంచి మే 14 వరకు అవకాశం కల్పించారు. సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 5 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ దరఖాస్తులకు ఏప్రిల్‌ 30 నుంచి మే 15 వరకు అవకాశం ఇచ్చారు.

సప్లిమెంటరీ లో పాస్ కాని వారికి ఓపెన్ టెన్త్ స్కూల్ పరీక్షలు పెడుతామని..అందులో పాస్ అయితే ఇదే విద్యాసంవత్సరంలో పై చదువులకు వెళ్లవచ్చని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి :

రేపు తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి