Rains: తెలంగాణలో రెండురోజులు వర్షాలు

Rains: విధాత: తెలంగాణలో రాబోయే రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ మధ్యప్రదేశ్‌, పరిసర ప్రాంతాల్లో విదర్భ మీదుగా తెలంగాణ మధ్య ప్రాంతాల వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి ద్రోణి సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. కోస్తాంధ్ర, యానాం మధ్య ప్రాంతాలు, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటున సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని హైదరాబాద్‌ […]

rains

Rains:

విధాత: తెలంగాణలో రాబోయే రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ మధ్యప్రదేశ్‌, పరిసర ప్రాంతాల్లో విదర్భ మీదుగా తెలంగాణ మధ్య ప్రాంతాల వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి ద్రోణి సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. కోస్తాంధ్ర, యానాం మధ్య ప్రాంతాలు, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటున సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని హైదరాబాద్‌ ప్రాంతీయ వాతావరణ కేంద్రం చెప్పింది.

ఈ జిల్లాలకు వర్ష సూచనలు

మంగళవారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం సైతం రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది. ఇదిలా ఉండగా.. గడిచిన 24 గంటల్లో ములుగు, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, నల్గొండ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాపాతం నమోదైందని టీజీడీపీఎస్‌ తెలిపింది.

Latest News