Vaikunta Ekadasi : ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి శోభ
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తజన సంద్రమయ్యాయి. తిరుమల, యాదాద్రి, భద్రాచలంలో వేకువజామునే ఉత్తర ద్వార దర్శనాలు ప్రారంభం కాగా, ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
విధాత : తెలుగు రాష్ట్రాల ఆలయాలు వైకుంఠ ఏకాదశి శోభతో వెలుగొందాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్బంగా ఉత్తర ద్వార దర్శనం కోసం ప్రసిద్ద పుణ్య క్షేత్రాలు తిరుమల, యాదగిరిగుట్ట, భద్రాచలం, ఒంటిమిట్ట, మఠంపల్లి లక్ష్మీనరసింహ ఆలయాలకు సహా అంతటా భక్తులు పోటెత్తారు. చలిని సైతం లెక్క చేయకుండా..తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని ఉత్తర ద్వార దర్శనాల కోసం బారులు తీరారు. తిరుమల శ్రీవారిని తెలుగు రాష్ట్రాల సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఉత్తర ద్వార దర్శనం కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు. రథంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు.
యాదగిరిగుట్టలో వైకుంఠ ఏకాదశి శోభ
యాదగిరి గుట్టలో తెల్లవారుజాము నుంచే శ్రీ లక్ష్మీనరసింహుల ఉత్తర ద్వార దర్శనం కొనసాగింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సహా పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. తొలి మంచు తెరల మాటున తెరుచుకున్న ఉత్తర ద్వారం నుంచి స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో ఉత్తర ద్వారం దర్శనానికి తరలివచ్చారు.
భద్రాచలంలో సీతారాముడి ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. రామయ్య ఉత్తర ద్వార దర్శననంతో వారంతా గోవింద నామస్మరణాలతో పులకించారు.
ఇవి కూడా చదవండి :
Komatireddy : సంక్రాంతికి ఆ రూట్ లో టోల్ చార్జీల రద్దు
ప్రియాంక వాధ్రా కొడుకు రైహాన్ పెళ్లిచేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram