Chimpanzee | 27 ఏండ్లు బందీగా చింపాజీ.. విడుద‌ల! గుండెను హత్తుకునే వీడియో

Chimpanzee | సోష‌ల్‌మీడియాలో వైరల్‌గా మారిన వీడియో విధాత‌: స్వేచ్ఛ.. అంటే రెండు అక్ష‌రాలు మాత్ర‌మే కాదు. ఒక నిర్బంధ‌మైన అనుభూతి. స్వ‌తంత్ర‌త‌. హ‌ద్దులేని ఆకాశ‌మూ.. అంతులేని భూమండ‌ల‌మూ.. స్వేచ్ఛా సంచారానికి ప్ర‌తీక‌. ఎగిరే ప‌క్షి రెక్క విరిచి స్వేచ్ఛ‌ను హ‌రించిన‌ట్టు.. ఒక రెండేండ్ల చిన్నారి చింపాజీని బంధించారు. ఒక‌టి కాదు, రెండు.. ఐదు కాదు ప‌ది కాదు.. ఏకంగా 27 బంధించారు. ఐద‌డుగుల చతురస్రాకార పంజ‌ర‌మే బంధిఖానాగా మారింది. చీక‌ట్లో చింపాజీ జీవితం గ‌డిచింది. ఎట్ట‌కేల‌కు […]

  • By: Somu    news    Jun 30, 2023 12:21 AM IST
Chimpanzee | 27 ఏండ్లు బందీగా చింపాజీ.. విడుద‌ల! గుండెను హత్తుకునే వీడియో

Chimpanzee |

  • సోష‌ల్‌మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

విధాత‌: స్వేచ్ఛ.. అంటే రెండు అక్ష‌రాలు మాత్ర‌మే కాదు. ఒక నిర్బంధ‌మైన అనుభూతి. స్వ‌తంత్ర‌త‌. హ‌ద్దులేని ఆకాశ‌మూ.. అంతులేని భూమండ‌ల‌మూ.. స్వేచ్ఛా సంచారానికి ప్ర‌తీక‌. ఎగిరే ప‌క్షి రెక్క విరిచి స్వేచ్ఛ‌ను హ‌రించిన‌ట్టు.. ఒక రెండేండ్ల చిన్నారి చింపాజీని బంధించారు. ఒక‌టి కాదు, రెండు.. ఐదు కాదు ప‌ది కాదు.. ఏకంగా 27 బంధించారు. ఐద‌డుగుల చతురస్రాకార పంజ‌ర‌మే బంధిఖానాగా మారింది.

చీక‌ట్లో చింపాజీ జీవితం గ‌డిచింది. ఎట్ట‌కేల‌కు చింపాజీకి స్వేచ్ఛ ఊపిరిపోసుకున్న‌ది. కిటికీ లాంటి గేటు నుంచి విడుద‌లైన ఆ చింపాజీ… ఒక్క‌సారి పైకి చూసింది.. ఎంత బాగుంది.. నీలాకాశం క‌నిపించ‌గానే దాని హృద‌యం పులకించిన‌ట్టుంది… భావోద్వేగంతో ఒక్క‌సారి వావ్‌.. అంటూ.. ఆశ్చ‌ర్య‌పోయిన‌ట్టు క‌నిపించింది. అక్క‌డి నుంచి మిగ‌తా చింపాజీల‌తో క‌లిసి ప‌చ్చిక మైదానంలోకి అడుగులు వేసింది.

చింపాజీ ఏమిటీ.. ఏమా క‌థ‌

వ‌నిల్లా అనే ఆడ చింపాజీ బంధించ‌బ‌డింది. న్యూయార్క్‌లోని ఎక్స్‌పెరిమెంటల్ మెడిసిన్ అండ్ సర్జరీ (LEMSIP) అనే ప్ర‌యోగ‌శాల‌కు దానిని త‌ర‌లించారు. రెండేండ్ల వ‌య‌సు వ‌ర‌కు చింపాజీ అక్క‌డే ఉన్న‌ది. 1997లో ప్ర‌యోగ‌శాల‌ను మూసివేశారు. త‌ర్వాత దానిని మ‌రికొన్నిచింపాజీల‌తో క‌లిసి కాలిఫోర్నియాకు త‌ర‌లించారు. వాటితో వినోద వ్యాపారం నిర్వ‌హించారు. 2019లో దానిని ప్ర‌ద‌ర్శ‌న శాల నుంచి పెద్ద ఎన్‌క్లోజ‌ర్‌లో మ‌రోచోట‌కు త‌ర‌లించారు.

గ‌త ఏడాది వినిల్లా చింపాంజీతోపాటు ఇత‌ర చింపాజీల‌ను 150 ఎకరాల అభ‌యార‌ణ్యానికి త‌ర‌లించారు. అడ‌విలో సంభ‌వించిన మంట‌ల‌తో బెదిరిపోయి ఎన్‌క్లోజ‌ర్‌కే వినిల్లా చింపాంజీ ప‌రిమిత‌మైంది. ఇటీవ‌ల బ‌య‌టి ప్ర‌పంచంలోకి తొలిసారిగా అడుగుపెట్టింది. అమెరికన్ సొసైటీ ఆఫ్ ప్రైమటాలజిస్ట్స్ సింపోజియమ్‌లో సేవ్ ది చింప్స్ ప్రైమటాలజిస్ట్ డాక్టర్ ఆండ్రూ హల్లోరన్ చింపాజీ తొలి భావోద్వేగానికి సంబంధించిన వీడియోను సోష‌ల్‌మీడియాలో షేర్ చేశారు. అది కాస్తా వైర‌ల్‌గా మారింది.