Trump | హూతీలను ఇలా హతమార్చాం: ట్రంప్ వీడియో విడుదల
విధాత : ఇజ్రాయెల్ నౌకలపై దాడుల్ని పునరుద్ధరిస్తామన్న యెమన్ తిరుగుబాటు దళం హుతీలపై అమెరికా తాజాగా భీకర దాడులు చేసింది. ఈ దాడులలో హుతీలను ఇలా హతమార్చామంటూ ‘ఎక్స్’ వేదికగా అమెరికా అధ్యక్షుడు షేర్ చేసిన డ్రోన్ వీడియో వైరల్ గా మారింది. యెమెన్‌లో సమావేశమైన హూతీలపై అమెరికా వైమానిక దళం బాంబర్ల దాడికి పాల్పడింది. వీడియోలో రౌండ్ గా నిల్చున్న హుతీల దళాలపై అమెరికా వైమానిక దళం బాంబులు కురిపించింది. దెబ్బకు 50మందికి పైగా హుతీలు అక్కడికక్కడే హతమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసిన ట్రంప్ హూతీలు నౌకలపై దాడి చేసేందుకే సిద్ధమయ్యారని ఆరోపించారు.
మళ్లీ అలాంటి దాడులకు పాల్పడకుండా చర్యలు తీసుకున్నామని ట్వీట్ చేశారు. ప్రపంచంలో ఎక్కడైనా జలమార్గాల్లో అమెరికా వాణజ్య, నౌక దళ నౌకలు స్వేచ్ఛగా వెళ్లకుండా ఏ ఉగ్రశక్తి ఆపలేదని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా దాడులపై హుతీ పొలిటికల్ బ్యూరో స్పందిస్తూ ఇదో యుద్ధ నేరమని..అమెరికాపై ప్రతిచర్యకు సిద్ధమేనన్నారు. అటు ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ స్పందిస్తూ హుతీల దాడులలో తమ ప్రమేయం లేదని..అది వారి సొంత వ్యవహారమన్నారు. తమపై అరోపణలు చేసి దాడులకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అగ్రరాజ్యాన్ని హెచ్చరించారు.
These Houthis gathered for instructions on an attack. Oops, there will be no attack by these Houthis!
They will never sink our ships again! pic.twitter.com/lEzfyDgWP5
— Donald J. Trump (@realDonaldTrump) April 4, 2025
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram