Hyderabad: మందుబాబులు జాగ్రత్త పడండి.. నేటి నుంచి మద్యం అమ్మకాలకు బ్రేక్!

విధాత: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు మూసీ వేయాలని హైదారాబాద్ సిటీ కమిషనర్ సీ.వీ.ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం సా.6 గంటల వరకూ మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని ఆదేశించారు. అలాగే కౌంటింగ్ డే 25వ తేదీన కూడా వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్స్ క్లోజ్ చేయాలని ఆదేశించారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
వరుసగా మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలు నిలిపివేయనున్న నేపథ్యంలో నగరంలోని మందుబాబులు వైన్స్ ల వద్ధ బారులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 23న జరిగే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ లో బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు, ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్ లు పోటీ పడుతున్నారు.