Rasi Phalalu: గురువారం, Feb20.. నేటి మీ రాశి ఫలాలు! వారి రుణప్రయత్నాలు సఫలం, స్వల్ప అనారోగ్యం

Rasi Phalalu| జ్యోతిషం, రాశి ఫలాలు అంటే మన తెలుగు వారికి ఏండ్ల తరబడి చెరగని నమ్మకం ఉంది. లేచినప్పటి నుంచి నిద్రించే వరకు మంచే జరగాలని కోరుకుంటూ ఉంటాం. అందుకే ప్రతీ రోజూ మన రాశి ఫలాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మన పనులు నిర్వహిస్తూ ఉంటాం. దాని ప్రకారమే నడుచుకుంటూ ఉంటాం కూడా. అందుకే నిద్ర లేవగానే మొదట చాలామంది వెతికేది వారికి ఆ రోజు ఎలా ఉండబోతుందనే. అలాంటి వారందరి కోసం వారి పేర్ల మీద నేటి ఈ రోజు (గురువారం, ఫిబ్రవరి 20)న మీరాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
మేషం
నూతన కార్యాలకు శ్రీకారం. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో పదో న్నతులకు అవకాశం ఉంది. మానసికోల్లాసం పొందుతారు. వ్యయ, ప్రయాసలు అధికం. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు. ఆకస్మిక ధననష్టం . వృత్తిరీత్యా కొత్త సమస్యలు. బంధు, మిత్రులతో స్నేహా పూర్వకంగా ఉండాలి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి
వృషభం
వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. వ్యవసాయ దారులకు లాభదాయకంగా ఉంటుంది. తొందర వల్ల ప్రయత్న కార్యాలకు ఆటంకం. చెడు వారికి దూరంగా ఉండాలి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనం. బంధుమిత్రులతో అపార్థాలు.
మిథునం
సాఫీగా ఉద్యోగ జీవితం. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు. బంధు మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి ప్రయత్నాలు, బంధువుల నుంచి శుభ వార్తలు. ఆకస్మిక కలహాలు. ధన నష్టం, అధిక రుణ ప్రయత్నాలు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి తగ్గుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు.
కర్కాటకం
ప్రతి ప్రయత్నం సఫలం. నూతన కార్యాలకు రూపకల్పన. ఆకస్మిక ధనలాభం. బంధువులతో వివాదాలు సద్దు మణుగుతాయి. సంపూర్ణంగా కుటుంబ సౌఖ్యం. బంధు, మిత్రులతో విందులు, వినోదాలు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది, ఆనందంగా కాలక్షేపం. ప్రముఖులతో మంచి పరిచయాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి
సింహం
ఉద్యోగంలో అనుకూల వాతావరణం. తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపారం వళ్ల ధననష్టం. అధికంగా వృధా ప్రయాణాలు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ విషయాల్లో అనాసక్తి. స్త్రీలకు విశ్రాంతి అవసరం. ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి. ఆర్థికంగా ఇబ్బందులు. స్నేహితులకు అండగా ఉంటారు.
కన్య
మిత్రుల నుంచి సహాయ సహకారాలు. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో నష్టాలు. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఉద్యోగ, పెళ్లి ప్రయ త్నాలు కొలిక్కి వస్తాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు. మంచి అవకాశం మిస్ అవుతుంది. ఆకస్మిక ధననష్టం. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు.
తుల
ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరం. బరువు బాధ్యతలు పెరుగుతాయి. సంతృప్తికరంగా వృత్తి, వ్యాపారాలు. రుణప్రయత్నాలు సఫలం. కుటుంబంలో మనశ్శాంతి ఉండదు. అందరినీ గుడ్డిగా నమ్మవద్దు. బంధు, మిత్రులతో వైరం అవకాశాలు. రహస్య, శతృబాధల అవకాశం. తలపెట్టిన పనులు పూర్తవుతాయి.
వృశ్చికం
ఉద్యోగంలో పని భారం ఎక్కువ. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికం. ఆకస్మిక ధననష్టం అవకాశాలు. అనారోగ్య బాధలు, డబ్బు ఖర్చు అధికం. తీర్థయాత్రలకు ప్రయత్నాలు. దైవదర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు. సజావుగా ఆర్థిక వ్యవహారాలు. బంధువుల రాకపోకలు. ఇంట్లో పండుగ వాతావరణం. వస్త్రా భరణాలు కొనుగోలు
ధనుస్సు
ఆకస్మిక ధనలాభం. కుటుంబంలో ఆనందోత్సాహాలు. బంధు, మిత్రులను కలుస్తారు. సమాజంలో గౌరవం. సంపూర్ణ ఆరోగ్యం. ప్రతి విషయంలో వృద్ధి. శుభకార్య ప్రయత్నాలు సులభం. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులకు సాయం చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
మకరం
సాఫీగా ఉద్యోగ జీవితం. మనసు చంచలం. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు. స్త్రీలతో తగాదాలు. బంధువులతో కలిసి శుభ కార్యంలో పాల్గొంటారు. ప్రయత్న కార్యాలు సఫలం. పనులు వాయిదా. ప్రయాణాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రశాంతంగా కుటుంబ వాతావరణం.
కుంభం
అకాల అనారోగ్య సమస్యలు. పిల్లల విషయంలో సడలింపు అవసరం. ముఖ్య మైన వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. మనోద్వేగానికి లోనవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం మంచిది. కొత్త పనులకు దూరంగా ఉండాలి. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టాలు. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలం. బంధువుల నుంచి శుభ వార్తలు.
మీనం
ప్రయత్నకార్యాల్లో విజయం. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగుల పనితీరుకు గుర్తింపు, ప్రోత్సాహకాలు లభిస్తాయి. కుటుంబమంతా సంతోషంగా కాలక్షేపం. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. దైవ సేవా కార్యక్రమాలకు సాయం కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం. రుణ, ఆర్థిక సమస్యలు తగ్గించుకుంటారు. ఆదాయం వృద్ధి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.