New Governors | మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

New Governors | మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి
గవర్నర్లుగా నలుగురు తెలుగు వారు

New Governors | విధాత, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu).. ముగ్గురు గవర్నర్ల నియామకానికి ఆమోద ముద్ర వేశారు. గోవా(Goa), హర్యానాతో(Haryana) పాటు కేంద్ర పాలిత ప్రాంతం అయిన లడఖ్(Ladakh) లకు నూతన గవర్నర్లను నియమించినట్లు రాష్ట్ర పతి భవన్ కార్యాలయం సోమవారం ప్రకటన జారీ చేసింది. నూతన గవర్నర్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పూసపాటి అశోక్ గజపతి రాజును(Pusapati Ashok Gajapathi Raju) గోవా గవర్నర్ గా నియమించారు. ప్రస్తుతం గోవా గవర్నర్ గా ఉన్న శ్రీధరన్ పిళ్లై(Sreedharan Pillai) స్థానంలో అశోక్ గజపతి రాజు నియామకమయ్యారు. ప్రస్తుతం హర్యానా గవర్నర్ గా ఉన్న బండారు దత్తాత్రేయ(Bandaru Dattatreya) పదవీ కాలం ముగియడంతో హర్యానా కొత్త గవర్నర్‌గా ప్రొఫెసర్ అషిమ్ కుమార్ ఘోష్(Professor Ashim Kumar Ghosh) ను కేంద్రం నియమించింది.

హర్యానా గవర్నర్ గా నియమితులైన అషిమ్ కుమార్(Ashim Kumar) కు.. ప్రొఫెసర్ గా అకడమిక్ లో సుదీర్ఘ అనుభవంతో పాటు రాజకీయ విశ్లేషకుడిగా మంచి గుర్తింపు ఉంది. కేంద్ర పాలిత ప్రాంతం అయిన లడఖ్ కు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ గా కవిందర్ గుప్తాను(Kavinder Gupta) నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకు ముందు లడఖ్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ గా ఉన్న బీ.డీ. మిశ్రా(B.D. Mishra) రాజీనామా చేయగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. బీ.డీ.మిశ్రా స్థానంలో వచ్చిన కవిందర్ గుప్తా జమ్మూ కశ్మీర్(Jammu and Kashmir ) డిప్యూటీ సీఎంగా పనిచేశారు. దీంతో గోవా, హర్యానాతోపాటు లడఖ్ గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం నియమించగా రాష్ట్రపతి ఆమోదిస్తు నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఇప్పటికే మూడు రాష్ర్టాలకు గవర్నర్లుగా తెలుగు రాష్ర్టాల ప్రముఖులు పంజాబ్ గవర్న ర్ గా బండారు దత్తాత్రేయ(Bandaru Dattatreya), త్రిపుర(Tripura) గవర్నర్ గా ఎన్. ఇంద్రసేనారెడ్డి (Nallu Indrasena Reddy ), ఒడిస్సా(odisha) గవర్నర్ గా కె. హరిబాబు(Hari Babu Kambhampati) ఉన్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్ గా నియమించడంతో మొత్తంగా నలుగురు తెలుగు వ్యక్తులు గవర్నర్ పదవుల్లో ఉన్నారు.