Viral News | స్క్రాప్ అనుకొని రూ.15 లక్షల విలువైన బంగారాన్ని అమ్మేశాడు.. తర్వాత ఏం జరిగిందంటే..?
హర్యానా (Haryana) రాష్ట్రం ఫరీదాబాద్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఇంట్లోని చెత్తను స్క్రాప్‌కు అమ్మేశాడు. అమ్మిన చెత్తలో రూ.15 లక్షల విలువైన బంగారం కూడా ఉంది (Haryana Man sold gold worth).
Viral News | హర్యానా (Haryana) రాష్ట్రం ఫరీదాబాద్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఇంట్లోని చెత్తను స్క్రాప్‌కు అమ్మేశాడు. అయితే, అమ్మిన చెత్తలో రూ.15 లక్షల విలువైన బంగారం కూడా ఉంది (Haryana Man sold gold worth). ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన సదరు వ్యక్తి ఆ నగల కోసం అమ్మిన చెత్తలో వెతికాడు. అయినా అది దొరకలేదు. దాదాపు నాలుగు నెలల తర్వాత ఆ నగలను స్క్రాప్ డీలర్ నిజాయతీగా వెనక్కి తిరిగిచ్చేశాడు (Scrap Dealer Returns Gold).
ఫరీదాబాద్‌కు చెందిన అశోక్ శర్మ గతేడాది జరిగిన కుంభమేళాకు వెళ్తూ.. ఇంట్లోని దాదాపు 100 గ్రాముల (10 తులాల) బంగారాన్ని ఓ సంచిలో దాచి ఓ చోట భద్రపరిచాడు. మేళా నుంచి తిరిగి వచ్చాక కూడా వాటి సంగతి మరిచిపోయాడు. గతేడాది అక్టోబర్‌లో దీపావళి పండుగను పురస్కరించుకొని ఇంటిని శుభ్రం చేశాడు. ఇంట్లోని చెత్తను స్థానికంగా ఉన్న స్క్రాప్ డీలర్ అక్తర్ ఖాన్‌కు విక్రయించాడు. అయితే, ఆ చెత్తతోపాటే బంగారం ఉన్న సంచిని కూడా అమ్మేశాడు.
కొన్ని రోజుల అనంతరం ఇంట్లో బంగారం లేనట్లు గుర్తించిన అశోక్ శర్మకు అసలు విషయం ఆలస్యంగా గుర్తుకొచ్చింది. స్క్రాప్‌తో పాటూ బంగారం సంచిని కూడా అమ్మేసినట్లు తెలుసుకున్నాడు. దీంతో వెంటనే స్క్రాప్ డీలర్‌ను సంప్రదించారు. అక్కడికి వెళ్లి చెత్తను మొత్తం జల్లెడపట్టారు. అయినా ఆభరణాలు దొరకలేదు. దీంతో చేసేదేమీ లేక అశోక్ నిరాశతో ఇంటికి తిరిగొచ్చేశాడు. బంగారు ఆభరణాలు మాయమవడంపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
నాలుగు నెలల తర్వాత..
ఇది జరిగిన నాలుగు నెలల తర్వాత స్క్రాప్ డీలర్ అక్తర్ చెత్తను వేరు చేయడం మొదలు పెట్టాడు. అందులో ఓ సంచి బయటపడింది. దాన్ని చూడగా.. బంగారు ఆభరణాలు ఉన్నాయి. దీంతో అతడు ఆ సంచిని తీసుకెళ్లి పోలీసులకు ఇచ్చాడు. అప్పటికే బంగారు ఆభరణాలు పోయినట్లు కంప్లైట్ ఉండటంతో.. అశోక్ వర్మ కుటుంబాన్ని పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. అక్తర్ ఖాన్ చేతులమీదుగా ఆభరణాలను వారికి ఇప్పించారు. దొరికింది దాచుకునే ఈ రోజుల్లో నిజాయతీగా రూ.లక్షలు విలువ చేసే బంగారాన్ని తిరిగి ఇచ్చినందుకు అతడిని ప్రశంసించారు. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు అక్తర్ నిజాయతీని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Swiggy Snacc | ప్రారంభించిన ఏడాదికే.. స్నాక్ సేవలకు ముగింపు పలికిన స్విగ్గీ
Seethakka : మంత్రి సీతక్క చొరవ..పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ది శాఖలో పదోన్నతులు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram