కోవిడ్‌ కట్టడిపై బాబు విషప్రచారం.. సజ్జల

విధాత‌(అమరావతి): కోవిడ్‌ కట్టడికి ఏపీ ప్ర‌భుత్వం స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతుంటే చంద్రబాబు నాయుడు మాత్రం విషప్రచారం చేస్తున్నార‌ని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. క‌రోనా క‌ష్ట‌కాలంలో ప్ర‌భుత్వానికి స‌రైన సూచ‌న‌లు ఇవ్వాల్సింది పోయి కొత్త వేరియంట్‌ అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నార‌ని మండి ప‌డ్డారు. బాబు అస‌త్య ప్ర‌చారాల వ‌ల్లే ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు.. ఏపీ, తెలంగాణ ప్రజల ప్రయాణాలపై నిర్బంధం విధించాయ‌ని అన్నారు. ఎన్ 440కే స్ట్రెయిన్‌ అనేది చంద్రబాబు […]

  • Publish Date - May 7, 2021 / 12:20 PM IST

విధాత‌(అమరావతి): కోవిడ్‌ కట్టడికి ఏపీ ప్ర‌భుత్వం స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతుంటే చంద్రబాబు నాయుడు మాత్రం విషప్రచారం చేస్తున్నార‌ని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. క‌రోనా క‌ష్ట‌కాలంలో ప్ర‌భుత్వానికి స‌రైన సూచ‌న‌లు ఇవ్వాల్సింది పోయి కొత్త వేరియంట్‌ అంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నార‌ని మండి ప‌డ్డారు.

బాబు అస‌త్య ప్ర‌చారాల వ‌ల్లే ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు.. ఏపీ, తెలంగాణ ప్రజల ప్రయాణాలపై నిర్బంధం విధించాయ‌ని అన్నారు. ఎన్ 440కే స్ట్రెయిన్‌ అనేది చంద్రబాబు సృష్టించిన అభూత కల్పన అన్నారు. రాజకీయం కోసమే ఇలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. పక్కరాష్ట్రంలో కూర్చొని ఏపీని చంద్రబాబు ఏం చేయాలనుకుంటున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.