అమూల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా సిఎం జగన్

విధాత‌(అమ‌రావ‌తి): అమూల్ కంపెనీకి ఏపీ సిఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారార‌ని ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు విమ‌ర్శించారు. ఏపీ డైయిరీకి చెందిన ఆస్తులను అమూల్ కు కట్టబెట్టడంతోనే కుట్ర బహిర్గతం అయ్యింద‌ని పేర్కొన్నారు. గుజరాత్ సంస్థ కోసం సంగం డెయిరీని, డెయిరీని న‌మ్ముకున్న రైతులను బలి చేస్తారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. తెలుగు భాష పై, తెలుగువారి డైయిరీపై ముఖ్యమంత్రికి నమ్మకం లేదా నిల‌దీశారు. ఏపీలో డైయిరీలను చంపేందుకు జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. […]

  • Publish Date - May 5, 2021 / 11:33 AM IST

విధాత‌(అమ‌రావ‌తి): అమూల్ కంపెనీకి ఏపీ సిఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారార‌ని ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు విమ‌ర్శించారు. ఏపీ డైయిరీకి చెందిన ఆస్తులను అమూల్ కు కట్టబెట్టడంతోనే కుట్ర బహిర్గతం అయ్యింద‌ని పేర్కొన్నారు. గుజరాత్ సంస్థ కోసం సంగం డెయిరీని, డెయిరీని న‌మ్ముకున్న రైతులను బలి చేస్తారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

తెలుగు భాష పై, తెలుగువారి డైయిరీపై ముఖ్యమంత్రికి నమ్మకం లేదా నిల‌దీశారు. ఏపీలో డైయిరీలను చంపేందుకు జగన్ రెడ్డి కుట్ర చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. రైతులు అమూల్ కు పాలు రాకపోవడంతో వారిపై కక్షగట్టార‌ని పేర్కొన్నారు. బాగా నడుస్తున్న వ్యవస్థను విధ్వంసం చేయడం ఏవిధంగా న్యాయం అని అచ్చెన్నాయుడు సీఎంను ప్ర‌శ్నించారు.

అమూల్ కు పాలుపోస్తేనే సంక్షేమ పథకాలంటూ బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపించారు. టీడీపీ నేతలపై కక్ష సాధింపుల కోసం డెయిరీ రంగాన్నే నిర్వీర్యం చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.