లోక్‌సభ ఎన్నికల ఓటమిపై నిరాశ .. రాజీనామాకు సిద్ధమైన.. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామాకు సిద్ధమయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో బీజేపీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాకు సిద్ధపడ్డారు.

లోక్‌సభ ఎన్నికల ఓటమిపై నిరాశ .. రాజీనామాకు సిద్ధమైన.. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌

విధాత : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామాకు సిద్ధమయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో బీజేపీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాకు సిద్ధపడ్డారు. డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తానని బీజేపీ అధిష్టానానికి ప్రతిపాదించారు. ఈ ఏడాది నవంబర్‌లో జరుగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిసారిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం బాధ్యతల నుంచి తనను తప్పించాలని బీజేపీ నాయకత్వాన్ని అభ్యర్థించారు.

బుధవారం ఈ విషయాన్ని దేవేంద్ర ఫడ్నవీస్‌ స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మహారాష్ట్రలో ఫలితాలకు నాదే బాధ్యత. పార్టీకి నేను నాయకత్వం వహిస్తున్నా. రాబోయే ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేయడానికి ప్రభుత్వ బాధ్యతల నుంచి నన్ను తప్పించాలని బీజేపీ హైకమాండ్‌ను అభ్యర్థిస్తున్నానని తెలిపారు. నేను ఎక్కడికి పారపోనని పోరాడుతానని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని 48 స్థానాల్లో 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 23 సీట్లు గెలిచింది. అయితే ఈసారి ఎన్నికల్లో కేవలం 9 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. సీఎం ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్‌ పవర్‌ నేతృత్వంలోని ఎన్సీపీతో కలిసి బీజేపీ ఎన్డీయే కూటమి