ఇదేం ఆన్, ఆఫ్ పద్దతి ?.. మంత్రి ఉత్తమ్ కు హరీశ్ రావు లేఖ!

కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల మోటార్ల ఆన్, ఆఫ్ పద్దతిని ప్రశ్నిస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్ రావు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా పదే పదే ఆన్, ఆఫ్ చేస్తూ అశాస్త్రీయంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

harish rao vs uttam kumar reddy

విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల మోటార్ల ఆన్, ఆఫ్ పద్దతిని ప్రశ్నిస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్ రావు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా పదే పదే ఆన్, ఆఫ్ చేస్తూ అశాస్త్రీయంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పంపులు, మోటార్లు పాడయ్యేలా కావాలనే ఈ కుట్ర జరుగుతుంది.. ఆ నెపాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా అని లేఖలో హరీశ్ రావు ప్రశ్నించారు. భారీ నీటిపారుదల మోటార్లను ఇష్టానుసారం స్టార్ట్, స్టాప్ చేయడం ఇంజనీరింగ్ నిబంధనలకు విరుద్ధం అన్నారు. ఇలా చేస్తే వైబ్రేషన్స్ వచ్చి పంపులు, ఇంప్లర్స్, మోటార్లు పాడైపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

చందలాపూర్ సహా ప్యాకేజీ 6, 8, 10, 11, 12 లలో మోటార్ల ఆపరేషన్ తీరు తీవ్ర అభ్యంతరకరంగా కొనసాగుతుందని తెలిపారు. ప్రాజెక్టులోని మోటార్లను పదే పదే ఆన్, ఆఫ్ చేయడం ఇంజినీరింగ్ నిబంధనలకు విరుద్ధమని, ఈ చర్య ప్రభుత్వ పాలనాపరమైన నిర్లక్ష్యమా? లేక కుట్రనా?’ అని నిలదీశారు. వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టులను ఇలా నిర్లక్ష్యంగా వాడటం శోచనీయమని ఆవేదన వెలిబుచ్చారు. ఇలా ఆన్, ఆఫ్ చేసే విధానం మానుకొని.. డిజైన్‌కు తగ్గట్టు పంపులు నిరంతరం నడిపించాలని సూచించారు. మీ రాజకీయాల కోసం ప్రాజెక్టులతో చెలగాటం ఆడొద్దంటూ మంత్రి ఉత్తమ్ ను హరీశ్ కోరారు.

ఇవి కూడా చదవండి :

ఇదేం ఆన్, ఆఫ్ పద్దతి ?.. మంత్రి ఉత్తమ్ కు హరీశ్ రావు లేఖ!
Anna lezhneva | పవన్ కళ్యాణ్‌కు ఇష్టమైన వంట ఇదే.. భార్య అన్నా లెజినోవా చెప్పిన ఇంట్రెస్టింగ్ విష‌యాలు

Latest News