రోజూ 8 వేలకు పైగా క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతుంటే నోరు విప్పరా…
కనీసం కేసీఆర్ పేరు ఎత్తడానికి కూడా భయపడిపోతున్నారా..
ఢిల్లీకి వెళ్లి తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం ఇది..లేదంటే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తీవ్ర దుర్భిక్షం తప్పదు..
తెలంగాణలోని పాలమూరు/రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులను 2016లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే చంద్రబాబు వ్యతిరేకించిన విషయం గుర్తుకుతెచ్చుకోండి…
చంద్రబాబు నాయుడు గాడిదలు కాయలేదు..ప్రజల కోసం, వారి హక్కుల కోసం కాపు కాశారు..
కడపలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా నాయకులతో కలసి మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి..
విధాత:రాయలసీమ బిడ్డ అయిన జగన్మోహన్ రెడ్డీ….మీకు రాజకీయ భిక్ష పెట్టిన రాయలసీమ ప్రజలు రోడ్డున పడే పరిస్థితి తేకండి..కరువుకు కేరాఫ్ అయిన రాయలసీను సస్యశామలం చేయడానికి నీలం సంజీవరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో నెహ్రూను ఒప్పించి శ్రీశైలం ప్రాజెక్టు తీసుకొచ్చారు..
ఈ రోజు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కలుసుకున్నారు..కలిసి భోజనాలు చేశారు..తెలంగాణలో ప్రాజెక్టులు ఓపెన్ చేసుకున్నారు..మీరు బాగుంటే మాకేమీ అభ్యంతరం లేదు..విభజన చట్టానికి, ట్రిబ్యునల్ తీర్పులకు వ్యతిరేకంగా 810 అడుగుల మట్టంలోనూ కృష్ణా జలాలు తీసుకెళ్లిపోతుంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించడం లేదు..
గోదావరి జలాలను తెలంగాణ మీదుగా ఏపీకి తీసుకొచ్చి కృష్ణాజిల్లాలో కలుపుతానన్న ఉత్తముడు కేసీఆర్ అని నిండు అసెంబ్లీలో పొగిడింది మీరే.ఈ రోజు కడప జిల్లాలోని ముఖ్యమైన ప్రాజెక్టులన్నీ ఎండిపోయే పరిస్థితి వచ్చినా, రాయలసీమకు నష్టం జరిగే విధంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరు విప్పడం లేదు..శ్రీశైలం ఇన్ ఫ్లోస్ పడిపోయిన తర్వాత ఎడమ గట్టు విద్యుత్ ప్రాజెక్టు రన్ చేసి సముద్రానికి నీళ్లు వదిలేసిన పరిస్థితి ఎప్పుడైనా చూశామా…
ఇవి కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిల వ్యక్తిగత విషయాలు కాదని గుర్తుంచుకోండి..
810 అడుగుల తక్కువ నీటిమట్టంలోనూ అవసరం లేకపోయినా విద్యుత్ ఉత్పత్తి పేరుతో నిత్యం 8 వేలకు పైగా క్యూసెక్కుల నీరు సముద్రం పాలుజేయడం ఆందోళన కలిగించే విషయం..834 అడుగులకు పైగా నీటిమట్టం ఉన్నప్పుడు, అది కూడా కుడి గట్టు పవర్ హౌస్ లోనే విద్యుత్ ఉత్పత్తి జరగాలని 1996లో ఇచ్చిన 69వ నంబరు జీవో స్పష్టం చేస్తోంది.అత్యవసర పరిస్థితుల్లో ఎడమ గట్టు పవర్ హౌస్ లో విద్యుత్ ఉత్పత్తి చేయాల్సివస్తే టెయిల్ పాండ్ పెట్టుకుని, డ్యాంలోకి రివర్స్ పంపింగ్ చేస్తూనే విద్యుత్ ఉత్పత్తి చేయాలని కూడా ఆ జీవోలో స్పష్టం చేశారు..
రాయలసీమ ప్రాంతానికి నీటి అవసరం ఎంతో తెలిసిన తర్వాత కూడా చట్టానికి విరుద్ధంగా నిత్యం 8 వేల క్యూసెక్కులు వృథా చేయడం తగదు..
అసలు టీఎంసీ అంటే అర్థం తెలుసా మీకు..దాని విలువ ఏమిటో తెలుసా మీకు…
ఒక టీఎంసీ అంటే 10 వేల ఎకరాల నుంచి 15 వేల ఎకరాల్లో పంటకు సరిపోయే నీటి పరిణామం..
ఒక టీఎంసీ అంటే శతకోటి ఘనపటడుగులు
ఒక టీఎంసీ అంటే 2831 కోట్ల 68 లక్షల 46 వేల 592 లీటర్లు
ఒక టీఎంసీ అంటే 2831 హెక్టార్లలో ఒక మీటరు ఎత్తున నీటిని నిల్వ చేసే పరిణామం.
ఒక టీఎంసీ అంటే 10.50 కోట్ల మంది ఒక రోజు తాగేందుకు ఉపయోగపడే నీరు..
ఏపీలోని 5 కోట్ల మంది ప్రజలు రెండు రోజులకు పైగా తాగే నీటి పరిణామం
ఒక టీఎంసీ అంటే హైదరాబాద్ మొత్తం జనాభాకి 10 రోజుల పాటు దాహం తీర్చే నీటి పరిణామం..
అంత విలువైన నీరు మూడు రోజులకు 2 టీఎంసీలకు పైగా సముద్రంలో కలిసిపోతుంటే ఇద్దరు సీఎంలు తమాషా చూస్తారా…
తాను సీఎం అయితే రాయలసీమను సస్యశామలం చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేస్తున్నారు..చంద్రబాబు నాయుడు 2016లోనే అపెక్స్ కౌన్సిల్ సమావేశలో కేసీఆర్ సమక్షంలోనే తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులను వ్యతిరేకించారు..ఆ రోజు అపెక్స్ మీటింగ్ మినిట్స్ చూసుకోండి..
ఆ రోజు మా నాయకుడు అభ్యంతరం చెబితేనే ఆ ప్రాజెక్టులు ఆగిపోయాయి…జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత తిరిగి ఆ ప్రాజెక్టుల పనులను ప్రారంభించారు..చంద్రబాబు నాయుడు గాడిదలు కాస్తున్నారా అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు..ఆయన గాడిదలు కాయలేదు…ప్రజల కోసం , వారి హక్కుల కోసం కాపు కాశారు..ఏ రోజు ఆయన డీవియేట్ కాలేదు..
మీరు తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా కృష్ణా జలాలపై ఆధారపడిన గండికోట, బ్రహ్మసాగరం, అవుకు, హంద్రీ నీవా, చిత్రావతి తదితర ఎన్నో ప్రాజెక్టులు ప్రమాదంలో పడ్డాయి…టీడీపీ ప్రభుత్వ హయాంలో 65 వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టారు..ఈ రోజు ఆ శాఖ ఎక్కడుందో తెలియని పరిస్థితి..పట్టిసీమ ద్వారా రోజూ 8 వేల క్యూసెక్కుల గోదావరి జలాలను తీసుకొస్తే గుంటూరు, క్రిష్ణా డెల్టాలకు అందించి, ఆ మేరకు మిగిలిన జలాలను రాయలసీమలో వినియోగించుకునే పరిస్థితి తెచ్చారు..
ఈ రెండేళ్లలో మీరు ఏం చేశారో చెప్పండి..ఇరిగేషన్ పరంగా రైతుల కోసం ఏం చేశారు..మీకు మీ కుటుంబానికి రాజకీయ బిక్ష పెట్టిన రాయలసీమకే అన్యాయం చేస్తున్నారు..శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 80 వేల కుటుంబాలు(80 శాతం) రాయలసీమ వాసులు నిర్వాసితులయ్యారు..అత్యంత దారుణమైన కరువు ప్రాంతాలుగా కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి..
కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో అనంతపురం ఇన్ చార్జి మంత్రిగా వ్యవహరించిన సమయంలో ఇక్కడి పరిస్థితులపై అధికారిక సమావేశాల్లో తన బాధ వ్యక్తపరిచారు.రాయలసీమకు నీళ్లు అందించి సస్యశామలం చేయాలని జగన్మోహన్ రెడ్డితో కలిసి ఇటీవల ఉపన్యాసాలు చేశారు..ఈ రోజు ఏమైంది…ఒక రోజేమో నీటి వాటాలు 50:50 శాతం అంటారు..ఇంకో రోజు ఏమో శ్రీశైలం నుంచి నీటి హక్కే లేదంటారు..పవర్ జనరేషన్ ప్రాజెక్టు మాత్రమే అని మాట్లాడుతారు..రాయలసీమలో అన్ని అనుమతులతో చేపట్టిన ప్రాజెక్టులపైనా తెలంగాణ ప్రభుత్వం అభాండాలు వేస్తోంది..మావి ఏవి అక్రమ ప్రాజెక్టులు కాదు..మీకు అవసరమైనప్పుడు మీ కేసుల కోసం మోదీ, అమిత్ షాల దగ్గరకు వెళ్లి కూర్చుంటారు కదా..ఇప్పుడు మాత్రం ప్రేమలేఖలు రాసి వదిలిపెట్టేస్తారా..ఇదేనా సీఎంగా జగన్మోహన్ రెడ్డి పోషించే పాత్ర..
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దగ్గరకు వెళ్లండి..రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగునీరు కూడా దొరకని ప్రమాదకర పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఇంతకంటే ముఖ్యమైనది ఏముంది..వెళ్లి అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయమని డిమాండ్ చేయండి..వెంటనే ఢిల్లీకి వెళ్లండి…తాడోపేడో తేల్చండి.రాయలసీమ ప్రాంత హక్కులు, క్రిష్ణా జలాల్లో వాటా విషయం తేల్చుకుని బయటకు రండి…ఎలాగూ ప్రత్యేక హోదా తెచ్చేది లేదు..నిధులు తెచ్చేది లేదు…ప్రత్యేక ప్యాకేజీ కూడా తెచ్చేది లేదు…కనీసం నీళ్ల కోసమైనా పోరాడండి..
జగన్మోహన్ రెడ్డి సత్తా ఏమిటో తేలాల్సిన సమయమిది..