విధాత: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరోనా ఉధృతి పెరుగుతోందని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మంత్రి ఆళ్ల నాని కరోనా వైఫల్యాలను కప్పిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కరోనా తీవ్రత లేకుంటే ఢిల్లీ ప్రభుత్వం ఏపీ ప్రయాణికులపై ఆంక్షలు ఎందుకు విధించిందని ఆయన ప్రశ్నించారు.
ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దునిద్ర వీడి కరోనా నివారణపై దృష్టి పెట్టాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలి, ప్రజల ప్రాణాలు కాపాడాలనే నినాదంతో రేపు ఫ్లకార్డుల ప్రదర్శన చేయనున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రజలు, టీడీపీ కార్యకర్తలు తమ గృహాల్లోనే ఫ్లకార్డులతో నిరసన తెలపాలని ఆయన కోరారు.