ఆర్టీసీ సమ్మె వెనుక హరీశ్.. పొన్నం సంచలన కామెంట్స్

తెలంగాణ ఆర్టీసీ సమ్మె వెనుక హరీశ్ రావు హస్తం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సమ్మెపై రాజకీయ దుమారం రేగుతోంది.

హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ సమ్మె వెనుక బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు హస్తం ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. అధికారులతో చర్చలు జరుగుతున్న సమయంలోనే జేఏసీ నేతలు ఎవరో ఫోన్ చేయగానే బయటకు వెళ్లిపోవడం కుట్రలో భాగమని విమర్శించారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి రాష్ట్రంలో లేనందునా వచ్చాక హామీలపై స్పష్టత ఇస్తామని, సమ్మె విరమించాలని కోరినా జేఏసీ నేతలు పట్టించుకోలేదన్నారు. ఇవ్వాళ హరీశ్ రావు ఆర్టీసీ సమ్మెపై మాట్లాడిన మాటలు చూస్తే..సమ్మె వెనుక వారి ప్రమేయం ఉందన్న అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. గతంలో ఆర్టీసీ సమ్మెను దారుణంగా అణిచివేసిన బీఆర్ఎస్ నేతల మాటలను కార్మికులు పట్టించుకోవద్దని, ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉందని పునరుద్ఘాటించారు. మా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల కోసం అనేక చర్యలు తీసుకుందని వివరించారు.

32అంశాల్లో పీఆర్సీ, యూనియన్లు, విలీనం మినహా అన్ని 29 డిమాండ్లకు ఒప్పుకున్నామని, విలీనంపై సాంకేతిక అంశాలను పరిష్కరించి నాలుగు వారాల్లో అన్నింటిని పరిష్కరిస్తామని చెప్పిన సమ్మెకు వెళ్లడం బాధకరం అని పొన్నం పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం విజయవంతం కావడం నచ్చకే ప్రతిపక్షాలు కుట్రతో కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని, ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఆర్టీసీపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. పేద ప్రజలకు లైఫ్ లైన్ గా ఉన్న ఆర్టీసీని దెబ్బతీయవద్దని కార్మికులను కోరుతున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Vijayashanti | బాల‌య్య‌తో సినిమాలు చేయ‌డం త‌గ్గించిన విజ‌య‌శాంతి.. కార‌ణం ఏంటో తెలుసా?
ప్రకాష్ రాజ్ ను చంపితే.. బాధ్యత నేను తీసుకుంటా: బీజేపీ నేత శ్రీనివాస్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు

Latest News