Rahul Gandhi| కులగణనపై రేవంత్ పై రాహుల్ ప్రశంసలు
తెలంగాణలో కులగణన చేపట్టాలని పుష్ చేశాను... ఇది విజయవంతంగా చేశారని ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అగ్రనాయకులు రేవంత్ రెడ్డి అభినందించారు
Rahul Gandhi
విధాత: తెలంగాణలో కులగణన చేపట్టాలని పుష్ చేశాను… ఇది విజయవంతంగా చేశారని ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అగ్రనాయకులు రేవంత్ రెడ్డి అభినందించారు. తెలంగాణలో నిర్వహించిన కులగణన, బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు న్యూఢిల్లీలోని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కులగణన సర్వే విజయవంతంగా నిర్వహించడం అంత ఈజీ కాదని ఆయన అన్నారు. కులగణనను చాలా స్పూర్తిదాయకంగా నిర్వహించారని ఆయన అన్నారు. ఇది ఒక మైలురాయిగా నిలుస్తోందన్నారు. దేశవ్యాప్తంగా కులగణన సర్వే చేపట్టాల్సిన అవసరం ఉందని రాహుల్ అభిప్రాయపడ్డారు. 55 ప్రశ్నలతో క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించారని.. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అంచనాలకు మించి రాణించారని ఆయన అన్నారు.
అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో జరిగిన సమగ్ర సర్వే డేటా 88 కోట్ల పేజీల్లోఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ కులగణనపై ప్రజలకు హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన చేపట్టినట్టు సీఎం తెలిపారు. దేశానికి దశదిశను చూపేలా కులగణనను చేపట్టామని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఒత్తిడితో దేశ వ్యాప్తంగా కులగణనకు కేంద్రం దిగివచ్చిందన్నారు.
పుట్టుకతో మోదీ ఓబీసీ కాదు… ఆయన లీగల్లీ కన్వర్టెడ్ ఓబీసీ అని రేవంత్ ఆరోపించారు. ఓబీసీల కోసం మనస్పూర్తిగా మోదీ చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. దేశం కోసం త్యాగాలు చేసింది కాంగ్రెస్ మాత్రమేనని సీఎం అన్నారు. ఫస్ట్ జనగణనతో కులగణనకు కేంద్రం అంగీకరించని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాహుల్ పోరాటం వల్లే కులగణనకు కేంద్రం దిగి వచ్చిందని రేవంత్ చెప్పారు. ఇదే తరహాలో మూడు రైతు చట్టాలు కూడా రాహుల్ పోరాటం వల్లే కేంద్రం రద్దు చేసిందన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram