ఎస్సీ వర్గీకరణ చట్టం.. అమలయ్యే వరకు ఉద్యోగాల భర్తీ ఆపాలి
విధాత, వరంగల్ : ఎస్సీల వర్గీకరణకు అసెంబ్లీలో చట్టం అమలు అయ్యేంతవరకు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏకశిల పార్క్ ధర్నా చౌక్ లో రిలే నిరాహార దీక్షలు జిల్లా అధ్యక్షుడు గద్దల సుకుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ దీక్షలకు ముఖ్య అతిథిగా ఎంఎస్పీ జాతీయ నేత మంద కుమార్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణ అయ్యేంతవరకు ఉద్యోగభర్తీని గ్రూప్ వన్, గ్రూప్ టూ, గ్రూప్ త్రీ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీని నిలిపివేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.
ఆగస్టు ఒకటో తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు అనుకూలం గా వర్గీకరణ చేస్తాం.. గతంలో రిక్రూట్మెంట్ లో కూడా వర్గీకరణ ప్రకారమే అమలు చేస్తాం.. అవసరమనుకుంటే ఆర్డినెన్స్ తీసుకొస్తామని సీఎం హామీఇచ్చారని గుర్తు చేశారు. జస్టిస్ షమీం అక్తర్ కమిషన్ రిపోర్ట్ ప్రక్షాళన చేసి మూడు గ్రూపులో నాలుగు గ్రూపులు చేయాలని, 15 లక్షలు ఉన్న మాలలకు ఐదు పర్సెంట్ ఇచ్చారు, 32 లక్షలు ఉన్న మాదిగలకు 9% ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగలకు 11% రావలసిన అవసరం ఉన్నదని సీఎం రేవంత్ కు కృష్ణ మాదిగ వినతి పత్రం సమర్పించారన్నారు.
దీనికి సానుకూలంగా రేవంత్ రెడ్డి మాట్లాడి ఆ తర్వాత పరోక్షంగా మాలలకు అనుకూలంగా వ్యవహరిస్తూ మాదిగల అన్యాయం చేస్తున్నారని అన్నారు. వెంటనే గ్రూప్ వన్ గ్రూప్ త్రీ ఉద్యోగుల భర్తిని నిలిపివేసి వర్గీకరణ బిల్లును తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని హెచ్చరించారు. ఈ దీక్షలో మంద రాజు మాదిగ. జన్ను దినేష్ మాదిగ బండారి సురేందర్ మాదిగచాతల్ల శివ మాదిగ. దర్గీ శ్రీనివాస్ మాదిగ. రజనీకార్. వస్కులా రాకేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram