ర‌ఘురామ‌కృష్ణంరాజుకు ఊహించ‌ని బ‌ర్త్‌డే షాక్‌

నాన్ బెయిల్‌బుల్ కేసులో అరెస్టు చేసిన సిఐడి పోలీసులుశ‌ని, ఆదివారాల్లో కోర్టుల‌కు సెల‌వుబెయిల్ రావాల‌న్నా సోమ‌వార‌మే అవ‌కాశం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుకు ఏపీ ప్ర‌భుత్వం బ‌ర్త్‌డే రోజు అరెస్టు చేసింది. వైసీపీ టికెట్‌పై న‌ర‌సాపురం నుంచి ఎంపీగా గెలిచిన ర‌ఘురామ‌కృష్ణంరాజు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది కూడా దాట‌క ముందునుంచే విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌స్తున్నారు. ప్ర‌తి రోజూ ఆయ‌న అదే కార్య‌క్ర‌మంగా పెట్టుకుని ప్రెస్‌మీట్లు నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితోపాటు, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, విజ‌య‌సాయిరెడ్డిల‌ను ఏమాత్రం లెక్క‌చేయ‌కుండా నోటికొచ్చిన‌ట్లు […]

  • Publish Date - May 15, 2021 / 05:24 AM IST

నాన్ బెయిల్‌బుల్ కేసులో అరెస్టు చేసిన సిఐడి పోలీసులు
శ‌ని, ఆదివారాల్లో కోర్టుల‌కు సెల‌వు
బెయిల్ రావాల‌న్నా సోమ‌వార‌మే అవ‌కాశం

ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజుకు ఏపీ ప్ర‌భుత్వం బ‌ర్త్‌డే రోజు అరెస్టు చేసింది. వైసీపీ టికెట్‌పై న‌ర‌సాపురం నుంచి ఎంపీగా గెలిచిన ర‌ఘురామ‌కృష్ణంరాజు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది కూడా దాట‌క ముందునుంచే విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌స్తున్నారు. ప్ర‌తి రోజూ ఆయ‌న అదే కార్య‌క్ర‌మంగా పెట్టుకుని ప్రెస్‌మీట్లు నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితోపాటు, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి, విజ‌య‌సాయిరెడ్డిల‌ను ఏమాత్రం లెక్క‌చేయ‌కుండా నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నారు. ఢిల్లీలో ప్ర‌ధానిని, హోంమంత్రి అమిత్‌షా, ఇత‌ర కేంద్ర మంత్రులను కూడా క‌లుస్తూ…ఏపీ ప్ర‌భుత్వంపై ఫిర్యాదులు చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసినందుకు 124 ఐపీసీ-ఎ సెక్షన్ కింద రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు అయింది. సిఐడి పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. రఘురామకృష్ణరాజుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు కావ‌డంతో పుట్టిన రోజు వేడుక‌ల్లో పాల్గొనేందుకు హైద‌రాబాదులోని సొంత ఇంటిలో ఉన్న స‌మ‌యంలో ఊహించ‌ని విధంగా సిఐడి పోలీసులు ఆయ‌న్ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. బలవంతంగా రఘురామకృష్ణం రాజును తీసుకెళ్లారు.

ఒక ఎంపీతో ఇలా ప్ర‌వ‌ర్తిస్తారా? భ‌ర‌త్‌రాజు
అరెస్టు వారెంటు లేకుండా ఎలా అరెస్టు చేస్తార‌ని ర‌ఘురామ‌కృష్ణం రాజు భ‌ర‌త్ మీడియా ద్వారా ప్ర‌శ్నించారు. రఘురామకృష్ణరాజు అరెస్ట్‌కు కారణాలు కూడా చెప్పకుండా.. కోర్టులో చూసుకోండని సీఐడీ అధికారులు అన్నారని భరత్‌ చెప్పారు. రఘురామను ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదని, అధికారం చేతిలో ఉందని ఏమైనా చేస్తారా? అని ప్రశ్నించారు. ‘‘కరోనా సమయంలో ఒక ఎంపీని ఎలా అరెస్ట్‌ చేస్తారు? రఘురామకు ఆరోగ్యం కూడా బాగాలేదు. ఇదంతా ఓ స్కెచ్. రఘురామ అరెస్ట్‌పై కోర్టులో హౌస్‌మోషన్‌ దాఖలు చేస్తాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.