ఉమ్మడి జిల్లాను మరింత అభివృద్ధి చేస్తాం మంత్రి… కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అందించిన ఘన విజయాలకు తోడుగా రెండు ఎంపీ స్థానాలు నల్లగొండ, భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికి పార్టీ ధన్యవాదాలు తెలియచేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు.

ఉమ్మడి జిల్లాను మరింత అభివృద్ధి చేస్తాం మంత్రి… కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

విధాత : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అందించిన ఘన విజయాలకు తోడుగా రెండు ఎంపీ స్థానాలు నల్లగొండ, భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికి పార్టీ ధన్యవాదాలు తెలియచేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. మంగళవారం నల్లగొండలో లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన జానారెడ్డి, రఘువీర్‌రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు.

నల్లగొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని 5.50 లక్షల ఓట్ల పైచిలుకు మెజార్టీతో, భువనగిరిలో చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని 2లక్షల పై చిలుకు మెజార్టీతో గెలిపించి మా బాధ్యత మరింత పెంచారన్నారు. జిల్లాలోని రెండు సీట్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో కార్యకర్తల కష్టం మరువలేనిదన్నారు. జిల్లా అభివృద్ధియే లక్ష్యంగా ముందుకెలుతామని, ప్రజలిచ్చిన విజయాల స్ఫూర్తితో మంత్రి ఉత్తమ్‌, నేను జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 9 నుంచి 12 స్థానాలు వస్తాయనుకున్నామని, రెండు మూడు సీట్లు తగ్గాయన్నారు.