Smart Phone | మీ స్మార్ట్ ఫోన్ తరచూ వేడెక్కుతోందా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే..!
Smart Phone | మీ స్మార్ట్ ఫోన్ తరచూ వేడిక్కుతుందా..? చార్జింగ్ త్వరగా దిగిపోతుందా..? అయితే మీరు కొన్ని టిప్స్ పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మార్కెట్లో విడుదలవుతున్న స్మార్ట్ ఫోన్‌లు అన్నీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో అందుబాటులోకి వస్తున్నాయి. దాంతో చార్జింగ్ సమయం చాలా తగ్గింది. తక్కువ సమయంలో ఎక్కువ ఛార్జింగ్ అవ్వడం కారణంగా ఫోన్ త్వరగా వేడెక్కుతోంది.
Smart Phone : మీ స్మార్ట్ ఫోన్ తరచూ వేడిక్కుతుందా..? చార్జింగ్ త్వరగా దిగిపోతుందా..? అయితే మీరు కొన్ని టిప్స్ పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మార్కెట్లో విడుదలవుతున్న స్మార్ట్ ఫోన్‌లు అన్నీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో అందుబాటులోకి వస్తున్నాయి. దాంతో చార్జింగ్ సమయం చాలా తగ్గింది. తక్కువ సమయంలో ఎక్కువ ఛార్జింగ్ అవ్వడం కారణంగా ఫోన్ త్వరగా వేడెక్కుతోంది.
ఇలా ఫోన్ వేడిక్కడం వల్ల ఎక్కిన చార్జింగ్ దిగపోతూ ఎక్కాల్సిన చార్జింగ్ నెమ్మదిస్తుంది. కాబట్టి ఫోన్ కేస్‌ను తీసివేసి చార్జింగ్ చేయడం ఉత్తమం. వైర్ లెస్ చార్జర్ ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి వైర్ చార్జర్‌ను ఉపయోగించడం మంచిది. పాత స్మార్ట్ ఫోన్లు త్వరగా వేడెక్కి అవకాశం చాలా ఎక్కువ. బ్యాటరీ పనితీరు సక్రమంగా లేకుంటే ప్రాసెసర్‌కు అవసరమైన విద్యుత్ శక్తిని అందించలేదు. కాబట్టి ఫోన్ లో కొత్త బ్యాటరీ అమర్చి ఉపయోగించుకోవాలి.
అదేవిధంగా స్మార్ట్ ఫోన్లకు ఎప్పుడూ దానికి సంబంధించిన కంపెనీ చార్జర్లను మాత్రమే ఉపయోగించాలి. బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జి అయ్యేంతవరకు ఫోన్ ఉపయోగించకూడదు. ఫోన్ చార్జింగ్ అవుతున్నప్పుడు లేదంటే వినియోగిస్తున్నప్పుడు వేడెక్కితే కాస్త విరామం ఇవ్వాలి. ఫోన్‌పై ఎలాంటి ఒత్తిడి లేకుండా ముఖ్యంగా ఎలాంటి ఫిజికల్ డ్యామేజ్ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ ఫోన్ నీటిలో పడితే దానిలోని నీరు పూర్తిగా ఆరిపోయే వరకు చార్జింగ్ పెట్టకూడదు.
కొంతమంది ఫోన్ చార్జింగ్ పెట్టి గేమ్స్ ఆడటమో లేదంటే ఫోన్ కాల్స్ మాట్లాడటమో చేస్తుంటారు. ఇలా చేయడంవల్ల ఫోన్ త్వరగా వేడెక్కుతుంది. అదేవిధంగా ఫోన్‌ను ఫుల్ ఛార్జ్ చేయకూడదు. 90 శాతం లేదంటే 95 శాతం చార్జింగ్ అయితే చాలు. 100 శాతం చార్జింగ్ పెట్టకూడదు. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే స్మార్ట్ ఫోన్లు రిపేరు కాకుండా ఎక్కువ రోజులు పనిచేస్తాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram