Suicide | ‘స్మార్ట్ ఫోన్’ లేదని చికిత్స నిరాకరణ.. 83 ఏండ్ల వృద్ధుడు ఆత్మహత్య
Suicide | స్మార్ట్ ఫోన్( Smart Phone ) లేదని చెప్పి ఓ వృద్ధుడికి( Old age Man ) చికిత్స చేసేందుకు నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన 83 ఏండ్ల ముసలాయన ప్రాణాలు తీసుకున్నాడు( Suicide ).

Suicide | అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుడు( old Age Man ) చికిత్స కోసమని ఆస్పత్రికి వెళ్లాడు. కానీ ఆయన వద్ద స్మార్ట్ ఫోన్( Smart Phone ) లేకపోవడమే పాపమైంది. స్మార్ట్ ఫోన్ లేదని చెప్పి.. ఆ ముసలాయనకు చికిత్స చేసేందుకు నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వృద్ధుడు ఆత్మహత్య( Suicide ) చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్( Uttar Pradesh )లోని భౌరావ్ దేవ్రాస్ ఆస్పత్రి(Bhaurao Devras Hospital )లో సోమవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
ఓల్డ్ మహానగర్‌కు చెందిన సుఖ్‌దేవ్ సింగ్(83) గత కొద్ది రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆయన షుగర్ వ్యాధిగ్రస్తుడు కూడా. అయితే చికిత్స కోసమని సోమవారం భౌరావ్ దేవ్రాస్ ఆస్పత్రికి వచ్చాడు. ఓపీ రిజిస్ట్రేషన్( OP Registration ) కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక లైన్‌లో అతను నిల్చున్నాడు. ఇక కౌంటర్ వద్దకు చేరుకున్న అతన్ని.. స్మార్ట్ ఫోన్ ఉందా..? అని ఉద్యోగి అడిగాడు. తనకు స్మార్ట్ ఫోన్ లేదని చెప్పాడు. స్మార్ట్ ఫోన్‌లో అభ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని, అప్పుడే ఓపీ రిజిస్ట్రేషన్ సాధ్యమవుతుందని సదరు ఉద్యోగి వృద్ధుడికి స్పష్టం చేశాడు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధిత వృద్ధుడు.. అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఇక ఆస్పత్రిలో ఉన్న ఓ బహుళ అంతస్తులు ఉన్న భవనంపైకి చేరుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మూడో అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. గమనించిన ఆస్పత్రి సిబ్బంది.. రక్తపు మడుగులో పడి ఉన్న వృద్ధుడిని ఎమర్జెన్సీ వార్డుకు తరలించగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వృద్ధుడి ఆత్మహత్యకు ఓపీ రిజిస్ట్రేషన్ చేయకపోవడం కారణమా..? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.